Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ స్టోరి: OTTలో టాప్ 10 సౌతిండియా స్పై మూవీస్

పెద్ద తెర‌ను మించి ఓటీటీ అద్భుత‌మైన కంటెంట్ ని అందిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 1:30 AM GMT
స్పెష‌ల్ స్టోరి: OTTలో టాప్ 10 సౌతిండియా స్పై మూవీస్
X

పెద్ద తెర‌ను మించి ఓటీటీ అద్భుత‌మైన కంటెంట్ ని అందిస్తోంది. రొటీనిటీకి భిన్నంగా వైవిధ్యం ఉన్న స్క్రిప్టుల‌తో ద‌ర్శ‌కుల ప్ర‌యోగాలు ప్ర‌జ‌ల్ని గొప్ప‌గా అల‌రిస్తున్నాయి. విభిన్న‌మైన క‌థ‌ల్ని ఓటీటీ ల్లో ఎలివేట్ చేసేందుకు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ఆస్కారం క‌లుగుతుండ‌డంతో ఇక్క‌డ అన్ లిమిటెడ్ బ‌ఫేని ఆస్వాధించేందుకు యువ‌త‌రం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎన్ని జాన‌ర్ లు ఉన్నా స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ల‌కు ఉన్న గిరాకీ వేరు. గ్రిప్పింగ్ నేరేష‌న్ తో గ‌గుర్పొడిచే యాక్షన్ విన్యాసాల‌తో స్పై సినిమాలు ఓటీటీ వీక్ష‌కుల‌కు స్పెష‌ల్ ట్రీటిస్తున్నాయి.

గూఢ‌చారి క‌థ‌ల్ని ఇష్ట‌ప‌డే ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం టాప్ 10 సౌతిండియ‌న్ స్పై సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం- విశ్వ‌రూపం 2 సినిమాలు చాలా ప్ర‌త్యేక‌మైన‌వి. తీవ్రవాదం వార్ డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స్పై సినిమాల‌తో క‌మ‌ల్ హాస‌న్ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా.. న‌టుడిగా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. ఇక విశ్వ‌రూపం ఫ్రాంఛైజీని మించి క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన స్పై యాక్ష‌న్ మూవీ `విక్ర‌మ్` పెద్ద తెర‌పై అల‌రించింద‌ని చెప్పాలి. క‌మ‌ల్ హాస‌న్ - విజ‌య్ సేతుప‌తి- ఫ‌హ‌ద్ ఫాజిల్ లాంటి గ్రేట్ యాక్ట‌ర్లు సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే న‌ట‌న‌తో మైమ‌రిపించారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ మూవీ ప్ర‌స్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ఎస్.జె.సూర్య విల‌న్ గా ఏ.ఆర్.మురుగ‌దాస్ తెర‌కెక్కించిన -స్పైడ‌ర్ స్పై జాన‌ర్ లో వచ్చిన సినిమా. ఇది థియేట‌ర్ల‌లో అంత‌గా ఆడ‌క‌పోయినా బుల్లితెర‌పై ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. ఓటీటీలో ప్ర‌క‌ట‌న‌లు లేకుండా చూసేందుకు అభిమానులు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇక త‌మిళ యువ‌హీరో విష్ణు విశాల్ న‌టించిన హిట్ చిత్రం -ఎఫ్.ఐ.ఆర్ స్పై యాక్ష‌న్ కేట‌గిరీలో వ‌చ్చిన త‌మిళ సినిమా. ప్ర‌స్తుతం ఓటీటీలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

నిఖిల్ న‌టించిన -స్పై థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుని ఓటీటీలోను అల‌రిస్తోంది. అడివి శేష్ న‌టించిన -గూఢ‌చారి, క్ష‌ణం చిత్రాలు స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లుగా అల‌రించాయి. శేష్ కి మంచి క‌థ‌కుడిగా ఆల్ రౌండ‌ర్ గుర్తింపునిచ్చిన చిత్రాలివి. అలాగే అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఏజెంట్ స్పై నేప‌థ్యంలోని సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌ల‌మైనా అఖిల్ మేకోవ‌ర్ యాక్ష‌న్ ఆక‌ట్టుకున్నాయి. ఇక యాక్ష‌న్ హీరో విశాల్ న‌టించిన `తుప్ప‌రివాల‌న్` కూడా గూఢ‌చారి క‌థ‌తో వ‌చ్చిన‌దే. ఈ సినిమా త‌మిళంలో చ‌క్క‌ని విజ‌యం సాధించింది. అలాగే అజిత్- వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ల‌తో ద‌రువు శివ తెర‌కెక్కించిన వివేగం (వివేకం) స్పై యాక్ష‌న్ సినిమా. పెద్ద తెర‌పై ఆశించినంత హిట్ కొట్ట‌క‌పోయినా యాక్ష‌న్ ప్రియుల‌కు ఓటీటీలో స్పెష‌ల్ ట్రీటిస్తోంది ఈ చిత్రం. పెద్ద‌తెర‌పై జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న వాటిని త‌ర‌చూ చూసేందుకు యువ‌త‌రం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుండడం ఇక్క‌డ ప‌రిశీలించ‌ద‌గిన‌ది.