Begin typing your search above and press return to search.

OTTలో టాప్ 10 సౌతిండియన్ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లలో టాప్ 10 సౌత్ ఇండియన్ గ్యాంగ్‌స్టర్ సినిమాలేవీ అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి.

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:45 AM GMT
OTTలో టాప్ 10 సౌతిండియన్ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలు
X

సౌత్ లో గ్యాంగ్ స్ట‌ర్ సినిమాలకు కొద‌వేమీ లేదు. వీట‌న్నిటినీ వ‌రుస పెట్టి చూడాల‌నుకుంటే ఓటీటీల్లో వెత‌కాలి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లలో టాప్ 10 సౌత్ ఇండియన్ గ్యాంగ్‌స్టర్ సినిమాలేవీ అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి. KGF, విక్రమ్, జిగర్తాండ,.. ఇలా టాప్ 10 సౌత్ ఇండియన్ గ్యాంగ్‌స్టర్ సినిమాల వివ‌రాల్లోకి వెళితే...

కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ సినిమా 'విక్ర‌మ్' డిస్నీ + హాట్‌స్టార్ అలాగే జీ 5లోను అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ఒకరితో ఒక‌రు పోటీప‌డి న‌టించారు. సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచింది.

రాకింగ్ స్టార్ యష్ న‌టించిన భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కేజీఎఫ్‌1' ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా అరాచ‌కాల‌పై తెర‌కెక్కించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. య‌ష్ ని ఓవ‌ర్ నైట్ పాన్ ఇండియా స్టార్ ని చేసిన చిత్ర‌మిది. హోంబ‌లే ఫిలింస్ నిర్మించింది. ఇదే ఫ్రాంఛైజీలో KGF 2 విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. పార్ట్ 2 పాన్ ఇండియా హిట్. ఈ రెండో భాగాన్ని కూడా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు

త‌మిళ స్టార్ హీరో ధనుష్ న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా 'వడ చెన్నై' ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. సూప‌ర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా 'క‌బాలి' ప్రైమ్ వీడియో , డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా అత‌డి సోద‌రుడు సెల్వ‌రాఘ‌వ‌న్ తెర‌కెక్కించిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా 'పుదుపేట్టై' ప్రైమ్ వీడియో, MX ప్లేయర్, డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

మణిరత్నం ఆల్-టైమ్ క్లాసిక్ క్రైమ్ డ్రామా 'నాయ‌క‌న్' ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. క‌మ‌ల్ హాస‌న్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును అందించిన చిత్ర‌మిది. క్లాసిక్ సినిమాగా హిస్ట‌రీలో నిలిచింది. ర‌జ‌నీకాంత్ న‌టించిన 'బాషా' గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాల‌కు ఆది గురువు. ఈ క్లాసిక్ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ మూవీ 'పోకిరి' సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. టాలీవుడ్ లో తొలి 40 కోట్ల క్ల‌బ్ సినిమా ఇది. ఈ చిత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. మహేష్ బాబు - ఇలియానా డిక్రూజ్ ఈ చిత్రంలో జంట‌గా న‌టించగా పూరి జ‌గ‌న్న‌థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌తోనే రూపొందిన 'ఆరణ్య కానం' చిత్రం MX ప్లేయర్, ప్రైమ్ వీడియో, డిస్నీలో అందుబాటులో ఉంది. ఇది IMDBలో అత్యధిక రేటింగ్ పొందిన చిత్రం. మలయాళ గ్యాంగ్‌స్టర్ చిత్రం -అంగమలై డెయిరీస్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో వీక్ష‌ణ‌కు అందుబాటులో ఉంది. సిద్ధార్థ్ - బాబీ సింహా న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ చిత్రం 'జిగర్తాండ' ప్రైమ్ వీడియో డిస్నీలో ఉంది. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న‌ కన్నడ చిత్రం 'గరుడ గమన వృషభ వాహన' గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంతో ఆక‌ట్టుకున్న సినిమా. రాజ్ శెట్టి -రిషబ్ శెట్టి కాంబినేష‌న్ మూవీ ఇది.