తమిళ స్టార్ డైరెక్టర్లు.. తప్పెక్కడ జరుగుతుంది?
సినీ ఇండస్ట్రీలో ప్రతీ వారం సెలబ్రిటీలు మారుతూ ఉంటారు. ఒక్కో వారం ఒక్కొక్కరు సెలబ్రిటీలుగా నిలుస్తుంటారు.
By: Tupaki Desk | 11 Jun 2025 3:00 AM ISTసినీ ఇండస్ట్రీలో ప్రతీ వారం సెలబ్రిటీలు మారుతూ ఉంటారు. ఒక్కో వారం ఒక్కొక్కరు సెలబ్రిటీలుగా నిలుస్తుంటారు. ఒక్కోసారి అప్పటి వరకు ఎవరో తెలియని వాళ్లు కూడా సడెన్ గా ఓవర్ నైట్ లో సెలబ్రిటీలుగా మారితే, మరోసారి అప్పటి వరకు స్టార్లుగా వెలుగుతున్న వారు కూడా సడెన్ గా డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు. అందుకే ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేం అంటుంటారు.
ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తమ కథ, కథనంతో ఆడియన్స్ ను మెప్పించలేక పోతే ఆ సినిమాకు పరాజయం తప్పదు. ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్లు శంకర్, మురుగదాస్, మణిరత్నం అదే ఫేజ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసి హిట్ అందుకుందామంటే అది కాస్త వెనక్కి వెళ్తూ వస్తుంది.
ఈ ఏడాది ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ల నుంచి సినిమాలొచ్చాయి. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ రాగా ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడటంతో పాటూ ఎంతో సమయాన్ని కూడా ఖర్చు చేశాడు. కానీ దానికి తగ్గ ఫలితాన్ని ఇటు శంకర్ అందుకోలేకపోగా, అటు చరణ్ కు కూడా దక్కలేదు.
ఇక మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో సికందర్ సినిమా చేస్తే ఆ సినిమా కూడా దారుణంగా ఫ్లాపైంది. రీసెంట్ గా మణిరత్నం కమల్ హాసన్ తో కలిసి థగ్ లైఫ్ సినిమా చేయగా ఆ సినిమా కూడా కోలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అయితే దీనికి కారణం వారు అదే పాతకాలపు స్టోరీలను ఆడియన్స్ కు చెప్పడంతో పాటూ, వారి నెరేషన్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతుంది.
దాంతో పాటూ స్టార్ డైరెక్టర్లు అవడంతో వారి నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కు కూడా విపరీతమైన అంచనాలుంటాయి. ఆ అంచనాలను చేరుకునే క్రమంలో సదరు డైరెక్టర్లకు ప్రెజర్ కూడా బాగా ఎక్కువైపోతుంది. ఇప్పటికైనా ఈ డైరెక్టర్లు తమ అవుట్‌డేటెడ్ కథలను, నెరేషన్ ను మార్చి ఈ జెనరేషన్ కు తగ్గట్టు సినిమాలు చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సుంది. మరి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తర్వాతి సినిమాల విషయంలో అయినా ఆ డైరెక్టర్లు జాగ్రత్త పడతారేమో చూడాలి.
