ఎక్కువ ఛార్జ్ చేస్తున్న డైరెక్టర్లు వీళ్లే!
కొందరు డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు వింటే వామ్మో అనిపించక మానదు. చాలా మంది డైరెక్టర్లు హీరోలతో సమానంగా పారితోషికాలు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 13 April 2025 2:00 AM ISTసౌత్ సినిమా స్థాయి బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతుంది. దీంతో సినిమాకు బడ్జెట్ భారీ రేంజ్ లో పెరుగుతుంది. ఒకప్పుడు సినిమా బడ్జెట్ అంటే సినిమా బడ్జెట్ అన్నట్టే ఉండేది కానీ ఈ మధ్య సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం సినిమాను ఆదరించే వారు ఎక్కువవడంతో పాటూ టెక్నాలజీ కూడా.
అయితే ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్లకే పోతుంది. ఒకప్పుడు అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్లు హీరోలకు ఉంటే ఇప్పుడు హీరోలతో పోటీ పడి మరీ డైరెక్టర్లు కూడా ఛార్జ్ చేస్తున్నారు. కొందరు డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు వింటే వామ్మో అనిపించక మానదు. చాలా మంది డైరెక్టర్లు హీరోలతో సమానంగా పారితోషికాలు తీసుకుంటున్నారు.
అందులో నెం.1 పొజిషన్ లో ఉన్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచెప్పిన రాజమౌళి ఆ సినిమాలతో వేల కోట్ల కలెక్షన్లను అందుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తన రెమ్యూనరేషన్ గా రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. రాజమౌళి ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయనకు ఫ్లాపులే లేవన్న సంగతి తెలిసిందే.
రాజమౌళి తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్న డైరెక్టర్ కూడా తెలుగు వాడే. అతనే సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ సినిమాతో తన సత్తా ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో చాటాడు.
యానిమల్ సినిమా సక్సెస్‌తో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా దేశంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకునే డైరెక్టర్ల లిస్టులో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సందీప్ చేసింది మూడు సినిమాలే అయినా ఆయన ఈ ఘనత సాధించడం మామూలు విషయం కాదు. ఇక సందీప్ రెడ్డి వంగా తర్వాత మూడో స్థానంలో ఉన్న డైరెక్టర్ అట్లీ. కేవలం ఆరు సినిమాలతో 100% సక్సెస్ రేటుతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అట్లీ. మెర్సల్, బిగిల్‌తో పాటూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అట్లీ ఇండియన్ సినిమాలో తన ప్లేస్ ను ఫిక్స్ చేసుకున్నాడు. జవాన్ సినిమాకు రూ.30 కోట్లు మాత్రమే ఛార్జ్ చేసిన అట్లీ నెక్ట్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు ఏకంగా రూ. 100 కోట్లకు రెమ్యూనరేషన్ ను పెంచినట్టు తెలుస్తోంది. అట్లీ తర్వాత రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లతో 4వ పొజిషన్ లో ఉంటే, రూ. 75 కోట్లతో సుకుమార్ ఐదవ స్థానంలో ఉన్నాడు.
