స్టార్ డైరెక్టర్లు అంతా వెయిటింగ్ లో!
స్టార్ హీరోలంతా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో వాళ్లతో సినిమాలు చేయాలనుకుంటోన్న డైరెక్టర్లు అంతా వెయిటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 7:00 AM ISTస్టార్ హీరోలంతా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో వాళ్లతో సినిమాలు చేయాలనుకుంటోన్న డైరెక్టర్లు అంతా వెయిటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. కానీ ఈ నలుగురు మాత్రం సంథిగ్ స్పెషల్. వాళ్లే సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్. ఇప్పటికే ఇందులో నలుగురు పాన్ ఇండియా డైరెక్టర్లు అయిపోయారు. వాళ్లు కూడా వెయిటింగ్ లోఉన్నారంటే సన్నివేశం ఎలా ఉందో అద్దం పడుతుంది.
రామ్ చరణ్ 17వ చిత్రం సుకుమార్ దర్శక త్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. `పెద్ది` పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలన్నది సుకుమార్ ప్లాన్. డిసెంబర్ కల్లా చరణ్ డేట్లు ఇస్తాడని సుకుమార్ వెయిట్ చేస్తున్నాడు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం కష్టమనే మాట వినిపిస్తుంది. డిసెంబర్ తర్వాతే చరణ్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
సరిగ్గా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు కొరటాల శివ కూడా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `దేవర 2` చిత్రాన్ని పట్టాలెక్కించాలని సిద్దంగా ఉన్నాడు. కానీ తారక్ `డ్రాగన్` షూట్ లో బిజీగా ఉన్నాడు. అదెప్పుడు పూర్తవుతుంది? అన్నది క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ కూడా ఫాస్ట్ గా పూర్తిచేసే దర్శకుడు కాదు. దీంతో కొరటాల కనీసం డిసెంబర్ కైనా తారక్ దొరుకుతాడా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
అలాగే పాన్ ఇండియా సంచలనాలు సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ అయితే ఒకే హీరో కోసం ఎదురు చూస్తున్నా రు. అతడే ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ `రాజాసాబ్` లో నటిస్తున్నాడు. దీంతో పాటు `పౌజీ` సినిమా పూర్తి చేస్తున్నాడు. `రాజాసాబ్` ఓ కొలిక్కి వచ్చింది. కానీ `పౌజీ` విషయంలో క్లారిటీ లేకపోవడంతో సందీప్ , నాగీ ప్రాజెక్ట్ లు పట్టాలెక్కడం ఎప్పుడు? అన్నది క్లారిటీ రావడం లేదు. గురూజీ త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ కోసం ఎదురు చూస్తున్నారు. బన్నీతో అనుకున్న ప్రాజెక్ట్ రకరకాల మలుపులు తిరిగిన నేపథ్యం తెలిసిందే. చివరిగా గురూజీ వెంకీకి లాక్ అవ్వడంతో? ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని రెడీ అవుతున్నారు.
