మూడు దశాబ్దాలకు సంచలన సీక్వెల్!
సీక్వెల్స్ అనగానే బాలీవుడ్ గుర్తొస్తుంది. హిందీ సినిమాలకు సీక్వెల్స్ అన్నది కామన్.
By: Tupaki Desk | 20 May 2025 10:30 AMసీక్వెల్స్ అనగానే బాలీవుడ్ గుర్తొస్తుంది. హిందీ సినిమాలకు సీక్వెల్స్ అన్నది కామన్. బాలీవుడ్ నుంచే టాలీవుడ్ లో నూ సీక్వెల్ ట్రెండ్ మొదలైంది. ఆ విషయంలో టాలీవుడ్ ఇప్పుడు సక్సెస్ పరంగా ముందం జలో ఉంది. ఒకే చిత్రాన్ని పాన్ ఇండియాలో రెండు భాగాలుగా రిలీజ్ చేసి సీక్వెల్ ట్రెండ్ ను కూడా టాలీవుడ్ మార్చేసింది. తాజాగా మూడు దశాబ్దాల క్రితం నాటి సంచలన హాలీవుడ్ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది.
యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన `టాప్ గన్ : మావెరిక్, డేస్ ఆఫ్ థండర్` సినిమాకు స్వీక్వెల్ అవకాశముందని ప్రకటించారు. అప్పట్లో ఈచిత్రం ఓ సంచలనం. 1999లో ఈ సినిమా రిలీజ్ అయింది. 2022 లో జోసెప్ కొసింస్కీ దర్శకత్వంలో తెరకెక్కిన `టాప్ గన్ మావెరిక్` మంచి విజయం సాధించింది. టోనీ స్కాట్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `డేస్ ఆఫ్ థండర్` లో నికోల్ కిడ్మన్ హీరోయిన్ గా నటించారు.
సీక్వెల్ కి సంబంధించి టామ్ క్రూజ్ ఆస్ట్రేలియా సమావేశంలో రివీల్ చేసాడు. `టాప్ గన్ మావెరిక్ తీయడానికి 35 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్ లపై పనిచేస్తున్నాను. అదే సమయంలో డేస్ ఆఫ్ థండర్ సీక్వెల్ ఆలోచన కూడా తట్టింది. బృందంతో చర్చలు కూడా నిర్వహించాను. వాళ్లు కూడా పాజిటివ్ గా స్పందించారు. ఎప్పుడు చేస్తామన్నది చెప్పలేను కానీ కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. అది ప్రేక్షకుల అంచనాలను మించి ప్లాన్ ఉంటుందని` తెలిపారు.
ప్రస్తుతం టామ్ క్రూజ్ `ది రివెనెంట్ `లో నటిస్తున్నాడు. దీనికి మెక్సికన్ దర్శకుడు అల్జెండారో ఇర్రినాటు పనిచేస్తున్నాడు. చిత్రీకరణ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం సమయం ఎక్కువగా పడుతుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. హై టెక్నికల్ స్టాండర్స్డ్ లో ఈసినిమా ఉంటుందని తెలిపారు.