Begin typing your search above and press return to search.

ఇలాంటి హీరోలతో ఎన్ని సినిమాలైనా చెయ్యొచ్చు!

ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో నిలదొక్కుకున్న హీరోలలో అడవి శేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   4 April 2024 3:50 AM GMT
ఇలాంటి హీరోలతో ఎన్ని సినిమాలైనా చెయ్యొచ్చు!
X

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే ఈరోజుల్లో అంత ఈజీ కాదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో నిలదొక్కుకున్న హీరోలలో అడవి శేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తెరపై నటించడమే కాదు.. తెర వెనుక జరిగే విషయాలను కూడా చూసుకుంటూ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు.

తెలుగులో శేష్, సిద్ధూ, విశ్వక్ లాంటి యంగ్ హీరోలు కొందరు.. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన కలిగి ఉండి, సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటారు. కథానాయకులుగా నటించడమే కాదు, సొంతంగా స్టోరీ రాసుకుంటారు.. స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తారు. దర్శకుడికి చేదోడు వాదోడుగా నిలుస్తారు.. అవసరమైతే మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

వీళ్లంతా మంచి అవుట్ ఫుట్ తీసుకురావడానికి కృషి చేయడమే కాదు, సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎంత చెయ్యాలో అంతా చేస్తారు. డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రిలీజ్ కు ముందే సినిమాకు కావల్సినంత బజ్ తీసుకొస్తారు. తాము తీసుకున్న రెమ్యునరేషన్ కు 100 శాతం పూర్తి న్యాయం చేయటానికి ప్రయత్నిస్తారు. నిర్మాతకు రెండింతల లాభం తెచ్చిపెట్టడానికి కష్ట పడతారు కాబట్టే, వీరితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. తన కష్టంతో ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'డీజే టిల్లు'తో మాంచి హిట్టు కొట్టిన సిద్దు.. లేటెస్టుగా 'టిల్లు స్క్వేర్' తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల మన్ననలు పొందుతున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ కు బ్యానర్ కు బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు స్టార్ బాయ్ సిద్దూ. ఇవి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టడంతో, ఇప్పుడు యువ హీరోతో మూడో మూవీ చేయటానికి రెడీ అవుతున్నారు నిర్మాత నాగవంశీ. 'టిల్లు 3' చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఇది 'టిల్లు క్యూబ్' అనే పేరుతో తెరకెక్కనుంది. అలానే బొమ్మరిల్లు భాస్కర్ తో 'జాక్ - కొంచం క్రాక్'.. నీరజ కోనను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ 'తెలుసు కదా' లాంటి మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి.

ఇక అడవి శేష్ సైతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'క్షణం', 'గూడాచారి', 'మేజర్' లాంటి చిత్రాలకి కథలు అందించిన శేష్.. ప్రస్తుతం G 2 (గూడాచారి 2), 'డెకాయిట్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు శేష్ స్టోరీ - స్క్రీన్ రాయడం విశేషం. మరోవైపు విశ్వక్ సేన్ కూడా యాక్టర్ కమ్ డైరక్టర్ గా రాణిస్తున్నాడు. ఇటీవలే 'గామి' లాంటి ప్రయోగాత్మక సినిమాతో పలకరించిన మాస్ కా దాస్.. వచ్చే నెలలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అంటూ వస్తున్నాడు. ప్రెజెంట్ 'మెకానిక్ రాకీ' మూవీలో నటిస్తున్నాడు. దీంతో పాటుగా 'లైలా' అనే సినిమాలో లేడీ గెటప్ లో అలరించడానికి రెడీ అవుతున్నాడు. అలానే తన స్వీయ దర్శకత్వంలో చేయటానికి కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటున్నాడు.