Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. ఇక ఈ ఆరు నెలలు బీభత్సమే..

ఈ ఏడాది ఆరంభం తెలుగు పరిశ్రమకి పెద్దగా కలిసిరాలేదు. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి రాలేదు

By:  Tupaki Desk   |   3 May 2024 4:31 AM GMT
టాలీవుడ్.. ఇక ఈ ఆరు నెలలు బీభత్సమే..
X

ఈ ఏడాది ఆరంభం తెలుగు పరిశ్రమకి పెద్దగా కలిసిరాలేదు. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి రాలేదు. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు మాత్రమే కాస్తా పెద్ద బడ్జెట్ మూవీస్ అని చెప్పాలి. వాటిలో హనుమాన్ మాత్రమే దేశ వ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో వచ్చిన మెప్పించలేకపోయాడు. మేనెలలో కాస్తా బజ్ ఉన్న సినిమాలే వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు అయితే కాదు.

జూన్ నుంచి వరుసగా ఆరు నెలలు మాత్రం టాలీవుడ్ బిగ్గిస్ అందరూ కూడా బ్యాక్ టూ బ్యాక్ నెలకి ఒకరు చొప్పున తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. వీరిలో మొదటిగా ఉన్నది డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జులైలో నందమూరి నటసింహం బాలయ్య NBK109 మూవీ రిలీజ్ కానుందంట. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఆగష్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో థియేటర్స్ లో సందడి చేయడానికి రాబోతున్నాడు. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అక్టోబర్ 10న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై తారక్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

నవంబర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయిన నవంబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాప్ చిత్రాల లైన్ అప్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ కూడా వచ్చింది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని క్రిష్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. తాజాగా మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ పీరియాడికల్ జోనర్ మూవీగా హరిహరవీరమల్లు రాబోతోంది. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తాజా టీజర్ లో కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.