Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డితో టాలీవుడ్ టాప్ దిగ్గజాలు

ప్రభుత్వం ఏదైనా వారితో సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులు మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:50 AM GMT
కోమటిరెడ్డితో టాలీవుడ్ టాప్ దిగ్గజాలు
X

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో దిల్ రాజు మాత్రమే వెళ్లి అతన్ని కలిశారు. తరువాత కోమటిరెడ్డి ఓ సందర్భంలో సినిమా వాళ్ళు ఎవరూ తనని కలవలేదని కామెంట్స్ చేశారు.


ఇదిలా ఉంటే సంక్రాంతి సీజన్ దగ్గర పడుతోంది. కొత్త సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వం ఏదైనా వారితో సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులు మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలన్న ప్రభుత్వానికి రిక్వస్ట్ చేసుకోవాలి. వారి నుంచి పర్మిషన్ వస్తేనే పండగ సమయంలో సినిమాకి అనుకున్న కలెక్షన్స్ ని నిర్మాతలు సొంతం చేసుకోగలరు.

పెద్ద సినిమాలు రిలీజ్ సమయంలో మొదటి వారం రోజులు టికెట్ ధరలే సినిమా కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తాయి. ఇది నిర్మాతలు అందరికి తెలుసు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలందరూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదగా కలుసుకున్నారు. దిల్ రాజు, సి కళ్యాణ్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్, నట్టి కుమార్, దామోదర్ ప్రసాద్, కె రాఘవేంద్రరావు వంటి సినీ పెద్దలు అందరూ కలిశారు.

కోమటిరెడ్డితో కొద్దిసేపు వారందరూ పిచ్చాపాటి మాట్లాడారు. నిర్మాతలతో పాటుగా డిస్టిబ్యూటర్స్ కూడా మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వారు ఏం చర్చించారు అనేది తెలియకపోయిన ఈ కలయిక అయితే సినిమా ఇండస్ట్రీకి మంచి పరిణామం అని చెప్పాలి. కాంగ్రెస్ సర్కార్ నుంచి కూడా టాలీవుడ్ నిర్మాతలకి ప్రోత్సాహం ఉంటుంది.

సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకమైన మూవీస్. హను మాన్ నుంచి గుంటూరు కారం వరకు ప్రతి సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించినవే. వీటికి టికెట్ ధరలు పెంచుకోవడానికి నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలందరూ కూడా సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డిని కలిసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.