Begin typing your search above and press return to search.

టైర్ 2 హీరోలు.. నెక్స్ట్ గట్టిగా కొట్టాల్సిందే..

నితిన్ కూడా ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాతో రెండు ఫ్లాప్ లు అందుకున్నాడు. నిఖిల్ కూడా గత ఏడాది స్పై మూవీతో ఫ్లాప్ సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:30 PM GMT
టైర్ 2 హీరోలు.. నెక్స్ట్ గట్టిగా కొట్టాల్సిందే..
X

టాలీవుడ్ లో టైర్ 2 హీరోలుగా ఉన్న నితిన్, రామ్ పోతినేని, నాగ చైతన్య, వైష్ణవ్ తేజ్ లాంటి స్టార్స్ అందరూ కూడా కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది వైష్ణవ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. రామ్ పోతినేని స్కంద మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నారు.

నితిన్ కూడా ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాతో రెండు ఫ్లాప్ లు అందుకున్నాడు. నిఖిల్ కూడా గత ఏడాది స్పై మూవీతో ఫ్లాప్ సొంతం చేసుకున్నారు. వీరందరికి కూడా ఇప్పుడు ఒక సక్సెస్ కావాలి. నితిన్ ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. అలాగే వేణు శ్రీరామ్ తో ఒక సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళారు. వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాతో నితిన్ సూపర్ హిట్ కొట్టారు.

ఇప్పుడు మరో హిట్ కోసం మళ్ళీ వెంకీనే నమ్ముకున్నాడు. ఇక రామ్ పోతినేని రెండు వరుస ఫ్లాప్ ల మీద ఉండటంతో ఇప్పుడు మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళారు. డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై చాలా నమ్మకంతో రామ్ పోతినేని ఉన్నారు.

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ పేరుతో ఒక మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రియలిస్టిక్ సంఘటనల స్పూర్తితో తెరకెక్కింది. అలాగే కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలపై వరుణ్ తేజ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఒక్క హిట్ కోసం ఈ ఏడాది ఈ హీరోలు అందరూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా హిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది ఈ హీరోలలో ఎవరికి సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.