Begin typing your search above and press return to search.

వి'చిత్రం'గా టాలీవుడ్ సమ్మర్.. ఆ రెండిటికి బంపర్ ఆఫరే!

అయితే టాలీవుడ్ సమ్మర్ పరిస్థితి భలే చిత్రంగా ఉంది. సాధారణంగా ఎప్పుడూ ఏప్రిల్‌ మొదలుకొని రెండు నెలలకుపైగా సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి.

By:  Tupaki Desk   |   17 Feb 2024 5:42 AM GMT
విచిత్రంగా టాలీవుడ్ సమ్మర్.. ఆ రెండిటికి బంపర్ ఆఫరే!
X

హాలిడేస్ లో సినిమాలను రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మంచి సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఎందుకంటే సెలవులను టార్గెట్ చేసి సినిమాలను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తుంటారు. అందుకే దర్శక నిర్మాతలు తమ మూవీలను అప్పుడే రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతికి, సమ్మర్ లో ఎక్కువగా చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి.

ఇక ఏడాది సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయింది. బాక్సాఫీస్ వద్ద నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమా పోటీ పడగా.. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా మూవీ విజేతగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కోట్లలో లాభాలు సంపాదిస్తోంది. దాంతోపాటు విడుదలైన మూడు చిత్రాలు గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి. ఇప్పుడీ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక మూవీ లవర్స్ దృష్టి.. సమ్మర్ పై పడింది.

అయితే టాలీవుడ్ సమ్మర్ పరిస్థితి భలే చిత్రంగా ఉంది. సాధారణంగా ఎప్పుడూ ఏప్రిల్‌ మొదలుకొని రెండు నెలలకుపైగా సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి. వాటి రికార్డుల కబుర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఈసారి రిలీజ్ ల కన్నా ఎక్కువగా కొత్త చిత్రాల ప్రారంభాలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సెట్స్ పై ఉన్న బడా స్టార్స్ చిత్రాలు విడుదల తేదీలపై ఇంకా క్లారిటీ కాలేదు. అనౌన్స్ చేసిన డేట్లకు రిలీజ్ అవుతాయో లేదో అని డౌట్ గా ఉంది.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ ఈ మూవీ షూటింగ్ చాలా పెండింగ్ ఉందని, కాబట్టి ఆగస్టులో రిలీజ్ అవ్వడం కష్టమేనని కొందరు అంటున్నారు. చిత్ర యూనిట్ మాత్రం ఎలా అయినా రిలీజ్ చేస్తామని చెబుతోంది. మరి చూడాలి ఈ సినిమా వస్తుందో? లేదో?

ఇక సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కల్కిలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను మే9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం డౌటేనని టాక్ వస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ నటిస్తున్న మూవీ దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ మేకర్స్ నిన్నే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 10న విడుదల చేస్తామని తెలిపారు. అయితే సైఫ్ ఇంకా కోలుకోలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి బట్టి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే దేవర వెనక్కి లేదా ముందుకు రావచ్చని సినీ పండితులు చెబుతున్నారు.

మరో ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కనీసం అప్డేట్స్ కూడా లేవు. ఇటీవలే ఈ మూవీ నిర్మాత దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ ను దసరాకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. మరి ఈ సినిమా అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందో లేదో కూడా డౌటే!

ఈ సినిమాలు సంగతి ఇలా ఉంటే.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రౌడీ హీరో సూపర్ హిట్ మూవీ గీతా గోవిందం కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, యంగ్ హీరో సిద్ధు జొన్నలగొడ్డ టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న రిలీజ్ కానుంది. పెద్ద స్టార్లు చిత్రాలు వాయిదాపడి, ఈ రెండు సినిమాలు బాగుంటే.. ఆయా మేకర్స్ కు డబ్బులే డబ్బులు అని చెప్పవచ్చు. మరేం జరుగుతుందో చూడాలి.