Begin typing your search above and press return to search.

దీపావ‌ళి 2023: టాలీవుడ్ స్టార్లు వెరీ స్పెష‌ల్

దీపావ‌ళి కుటుంబ వేడుక‌ల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం. ఇంటిల్లిపాదీ ఓచోట చేరి ఆనందంగా ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం భార‌తీయ సాంప్ర‌దాయంలో భాగం

By:  Tupaki Desk   |   13 Nov 2023 5:07 AM GMT
దీపావ‌ళి 2023: టాలీవుడ్ స్టార్లు వెరీ స్పెష‌ల్
X

దీపావ‌ళి కుటుంబ వేడుక‌ల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం. ఇంటిల్లిపాదీ ఓచోట చేరి ఆనందంగా ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం భార‌తీయ సాంప్ర‌దాయంలో భాగం. దీపావ‌ళి 2023 వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. కుటుంబంతో సమయం గడపడం, స్నేహితులను కలవడం, ట‌పాసులు పేల్చ‌డం వ‌గైరా ఉత్సవాలు ఆనందంగా జ‌రిగాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్ స‌హా పలువురు టాలీవుడ్ స్టార్లు తమ కుటుంబాలతో కలిసి దీపావళి 2023 వేడుక‌ల్ని వైభ‌వంగా జ‌రుపుకున్నారు. స్టార్లు తమ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీపావళి 2023కి ఒక రోజు ముందు రామ్ చరణ్ -ఉపాసన తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప‌రిచ‌య‌స్తులు, మిత్రులంద‌రినీ పార్టీకి ఆహ్వానించారు. గ‌త రాత్రి రామ్ చరణ్ -ఉపాస‌న స‌హా జూనియర్ ఎన్టీఆర్- ప్ర‌ణ‌తి .. అల్లు అర్జున్ - స్నేహారెడ్డి ఇత‌ర‌తారలు కుటుంబంతో కలిసి దీపావళి 2023ని జరుపుకున్నారు


ఇంత‌కుముందు రామ్ చరణ్ - ఉపాసనల దీపావళి పార్టీకి చిరంజీవి, నాగార్జున‌, వెంకటేష్, మ‌హేష్, జూనియర్ ఎన్టీఆర్ త‌దిత‌ర‌ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు దీపావ‌ళి నైట్ క్రాక‌ర్స్ పేలుస్తూ సంద‌డిగా ఉన్న సినీప్ర‌ముఖుల ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. నవంబర్ 12న ఓవైపు నెద‌ర్లాండ్స్ పై టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ గ్రేట్ విక్ట‌రీని ఆస్వాధిస్తూనే, చాలా మంది ప్రముఖులు దీపావళి 2023 నాడు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపారు.


అటు కోలీవుడ్ లో రజనీకాంత్, ధ‌నుష్‌, సూర్య‌, కార్తీ, విక్ర‌మ్ వంటి ప్ర‌ముఖులు తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావ‌ళి వేడుక‌ల్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మ‌రోవైపు బాలీవుడ్ స‌హా ఇత‌ర సినీప‌రిశ్ర‌మ‌ల్లోను సెల‌బ్రిటీ పార్టీల‌కు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో పోటెత్తాయి.


సోష‌ల్ మీడియాల్లో సంద‌డి:


ఇంత‌కుముందే ఎన్టీఆర్ క్యూట్ ఫ్యామిలీ ఫోటోని సోస‌ల్ మీడియాల్లో షేర్ చేయగా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి నలుపు రంగు పూల కుర్తాలతో కవలలుగా క‌నిపించిన‌ క్యూట్ ఫోటోను పోస్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు మరియు తన పెంపుడు కుక్కతో కలిసి ఈ రోజును జరుపుకున్నాడు. ప‌లువురు ద‌క్షిణాది క‌థానాయిక‌లు త‌మ కుటుంబంతో దీపావ‌ళి వేడుక‌ల్ని జ‌రుపుకుంటున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే 2023 దీపావళిని తన కుటుంబ సభ్యులతో జరుపుకుంది. మాళవిక మోహనన్ త్వరగా షూట్ ముగించుకుని తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2023 దీపావళి సందర్భంగా పలువురు ప్రముఖులు తమ స్నేహితులు కుటుంబాలకు సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు.