Begin typing your search above and press return to search.

AI తో మన స్టార్స్ లుక్స్... కిక్కిస్తున్నారుగా

మారుతున్న టెక్నాలజీలో అద్భుతమైన విజువల్స్ చాలా సులభంగా ఇప్పుడు ఆవిష్కరించగలుగుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Sept 2023 12:05 PM IST
AI తో మన స్టార్స్ లుక్స్... కిక్కిస్తున్నారుగా
X

మారుతున్న టెక్నాలజీలో అద్భుతమైన విజువల్స్ చాలా సులభంగా ఇప్పుడు ఆవిష్కరించగలుగుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తక్కువ టైంలోనే అత్యంత ప్రభావవంతంగా మారిపోయింది. ఇమేజ్ రీక్రియేషన్ లో ఈ AI వెబ్ సైట్స్ గొప్పగా పని చేస్తున్నాయి. మన ఇమాజినేషన్ ని టెక్స్ట్ రూపంలో ఇస్తే దానిని ఒక ఇమేజ్ గా క్రియేట్ చేసి మన ముందు ఉంచుతున్నాయి.

ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని కొంతమంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలని డిఫరెంట్ బ్యాగ్రౌండ్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్స్ కి సంబంధించి AI క్రియేటెడ్ ఇమేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని ఆయా హీరోల అభిమానులు కూడా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. గన్స్, బుల్లెట్స్ తో ఓజీ సినిమాని రిప్రజెంట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని రీక్రియేట్ చేశారు.

దూరం నుంచి చిత్రాన్ని అబ్జార్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ పేస్ కనిపిస్తుంది.అలాగే ఎత్తైన పర్వతాలలో సలార్ లుక్ లో ప్రభాస్ ని, మండుతున్న అగ్నిపర్వతంలో గుంటూరుకారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ ని ఆవిష్కరించారు. అలాగే తీరంలో ఉన్న నాటు పడవలు, సముద్రంపైన ఉన్న ఉన్న సైన్ లైట్ తో దేవరలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనిపించే విధంగా AI సహాయంతో క్రియేట్ చేశారు.


AI సహాయంతో చేసిన ఈ స్టార్ హీరోల ముఖచిత్రాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్స్ సహాయంతో మ్యాన్యువల్ గా హ్యూమన్ క్రియేటివిటీ ఉపయోగించి ఇలాంటి ఇల్యూజన్ ఫోటోలు సృష్టించేవారు. అయితే టెక్నాలజీ అభివృద్ధితో వీటిని ప్రతి ఒక్కరు AI టూల్స్ సహాయంతో చాలా ఈజీగా చేసేయగలుగుతున్నారు.


ఏది ఏమైనా ఈ రకమైన క్రియేషన్స్ ఇది వరకు ఉన్న ఈ స్థాయిలో ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేదు. మొదటి సారిగా AI ఇల్యూజన్ స్టార్ హీరోల ఇమేజ్ లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కోవలో మరిన్ని ఇల్యూజన్ ఇమేజ్ లు వస్తాయో చూడాలి.