Begin typing your search above and press return to search.

విజయ్ రేంజ్ లో నాని ఎందుకు క్లిక్కవ్వట్లే?

నేచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో సినిమా సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ కొత్త కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:07 AM GMT
విజయ్ రేంజ్ లో నాని ఎందుకు క్లిక్కవ్వట్లే?
X

నేచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో సినిమా సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ కొత్త కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. అతని కెరియర్ పరంగా చూసుకున్న ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉంటాయి. దీనికి కారణం ఎక్కువగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలని ఎంపిక చేసుకోవడమే. రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ని నాని తన ఖాతాలో వేసుకున్నాడు.

నాని శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే తెలుగులో సక్సెస్ అందుకొని ప్రేక్షకులని మెప్పిస్తొన్న ఈ సినిమాలు ఇతర భాషలలో మాత్రం ఆశించిన స్థాయిలో రీచ్ కావడం లేదు. ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోన్న ప్రేక్షకులని థియేటర్స్ వరకు రప్పించుకోలేకపోతున్నాడు.

కానీ దీనికి భిన్నంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం తన ఫ్లాప్ సినిమాలతో కూడా ఇతర భాషలలోకి బాగా రీచ్ అయ్యాడు. ఒకప్పుడు నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ గీతాగోవిందం సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి హిట్ అయ్యింది. డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ చేశారు. పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో ట్రై చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లోనే విజయ్ కి నార్త్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే మూవీకి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే కథ సరిగా లేకపోవడం వలన సక్సెస్ రాలేదు. ఖుషి మూవీ కూడా తెలుగుతో పాటు మరో నాలుగు భాషలలో రిలీజ్ అయ్యింది. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మిగిలిన భాషలలో అంత ప్రభావం చూపించలేదు. ఫ్లాప్ అయిన కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దీనిని బట్టి నానితో పోల్చుకుంటే విజయ్ దేవరకొండకి ఇతర భాషలలో కూడా మంచి మార్కెట్ ఉంది. సరైన హిట్ పడితే కలెక్షన్స్ లో ఆ పభావం కనిపించే అవకాశం ఉండేది. ఫ్లాప్ సినిమాలు చేసిన బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. నాని మాత్రం వరుస సక్సెస్ లు అందుకుంటున్న పాన్ ఇండియా రేంజ్ లో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయాడు.