Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో న్యూ ట్విస్ట్!

ఆ సమయంలో థియేటర్స్ కి ప్రేక్షకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా సంక్రాంతి సీజన్ లో డేట్ లాక్ చేస్తాయి

By:  Tupaki Desk   |   16 July 2023 5:27 AM GMT
సంక్రాంతి రేసులో న్యూ ట్విస్ట్!
X

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టాలీవుడ్ కి పండగ అని చెప్పాలి. ఈ సమయంలో పెద్ద హీరోలు అందరూ తమ సినిమాలని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో థియేటర్స్ కి ప్రేక్షకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా సంక్రాంతి సీజన్ లో డేట్ లాక్ చేస్తాయి. ఆ సమయంలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు హిట్ అయ్యాయి. అజిత్ తెగింపు కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే డేట్స్ లాక్ చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల సంగతి ఓ సారి చూసుకుంటే మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతోన్న సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రాజెక్ట్ కె మూవీ వాయిదా పడటంతో హనుమాన్ ను ప్రశాంత్ వర్మ లైన్ లోకి తీసుకొచ్చారు. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న VD 13 మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

ఈ ఏడాది వారసుడు మూవీతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన దిల్ రాజు వచ్చే ఏడాదికి విజయ్ దేవరకొండ సినిమాని సిద్ధం చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరే అవకాశం ఉంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సుస్మిత కొనెదల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నారు. ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు అయిన సంక్రాంతి రేసులో పోటీ పడబోయే సినిమాల జాబితా ఇదే. అయితే టైమ్ దగ్గర పడుతున్న కొద్ది రేసులోకి కొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడున్న కొన్ని చిత్రాలు వాయిదా పడే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోయే చిత్రాలలో ఎవుంటాయో చూడాలి.