Begin typing your search above and press return to search.

ఈ వారం రీరిలీజ్​ల హవా.. కొత్త చిత్రాలను దెబ్బేశాయిగా!

అయితే ఈ చిత్రాలన్నింటీలో ఒకదానిపై కూడా ఆడియెన్స్​ ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తోంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 11:31 AM GMT
ఈ వారం రీరిలీజ్​ల హవా.. కొత్త చిత్రాలను దెబ్బేశాయిగా!
X

వీకెండ్​ వచ్చేసింది. బాక్సాఫీస్​ వద్ద సినిమాల సందడి మొదలుకానుంది. పోయిన వారం రిలీజైన 'బ్రో' డివైడ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ మాములు పరిస్థితికి వచ్చేశాయి. ఇక మూడు వారాల పాటు సక్సెస్​ఫుల్​ రన్​ అయిన బేబీ కూడా దాదాపుగా ప్రేక్షకులందరూ సినిమా చూసేయడంతో కాస్త డీలా పడింది. దీంతో చిన్న సినిమాలు చాలానే ఆగస్ట్​ 4 శుక్రవారం రిలీజ్​కు రెడీ అయ్యాయి.

రాజుగారి కోడిపలావు, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, ప్రియమైన ప్రియ, మిస్టేక్, దిల్ సే, రెంట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. అలానే పలు డబ్బింగ్​ చిత్రాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్​ ముందుకు రానున్నాయి. హాలీవుడ్ చిత్రం 'మెగ్ 2 : ది ట్రెంచ్', అర్జున్ దాస్ 'బ్లడ్ అండ్ చాకోలెట్', కన్నడ హీరో కిచ్చా సుదీప్ 'హెబ్బులి', టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ధోని నిర్మించిన మొదటి సినిమా 'లెట్స్ గెట్ మ్యారీడ్​', విజయ్ ఆంటోనీ 'విక్రమ్ రాథోడ్'.. ఇలా చాలా సినిమాలు ఒకేసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి.

అయితే ఈ చిత్రాలన్నింటీలో ఒకదానిపై కూడా ఆడియెన్స్​ ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తోంది. కనీస అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగలేదని తెలిసింది. అంతా ఖాళీగానే ఉందట. మౌత్ టాక్ బాగుండి, ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప.. ఈ చిత్రాలన్నీ రన్ అవుతాయని పక్కాగా చెప్పలేమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

కానీ ఇక్కడ మరో విషయమేమింటే.. కొత్తగా రిలీజ్​ కానున్న సినిమాలు కాకుండా.. బాక్సాఫీస్​ దగ్గర రీరిలీజ్​ సినిమాల డిమాండ్​ ఎక్కువగా కనిపిస్తోంది. ఆడియెన్స్​, ఫ్యాన్స్ వీటిని చూసేందుకే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. 'బిజినెస్ మెన్', 'సూర్య సన్ అఫ్ కృష్ణన్' వంటి చిత్రాలకు జోరుగా ఆన్ లైన్ బుకింగ్స్ జరుగుతన్నాయని తెలిసింది.

మహేశ్​ బాబు ఫ్యాన్స్ అయితే బిజినెస్​ మెన్ కోసం బాగా హడావుడి చేస్తున్నారట. భారీగా టికెట్లు అమ్ముడుపోయాని అంటున్నారు. మెయిన్ సెంటర్స్​ అయితే ఈ బిజినెస్​ మెన్​, సూర్య సన్ అఫ్ కృష్ణన్.. ఈ రెండు చిత్రాల మార్నింగ్ షో టికెట్లు ఇప్పటికే ఆశించిన స్థాయిలో అమ్ముడుపోయాయని తెలిసింది. మిగిలిన షోలకు కూడా మంచి డిమాండ్ కనిపిస్తుందని తెలుస్తోంది.