Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి మళ్ళీ ఊపొస్తుంది.. బిగ్ బ్లాస్ట్!

ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకి మాత్రమే కేరాఫ్ గా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తదనం ప్లస్ కమర్షియల్ కలగలిపిన సినిమాలతో ఇండియన్ సినిమాని రూల్ చేస్తోంది

By:  Tupaki Desk   |   3 Oct 2023 5:11 AM GMT
టాలీవుడ్ కి మళ్ళీ ఊపొస్తుంది.. బిగ్ బ్లాస్ట్!
X

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ రేంజ్ మారింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెలుగు సినిమా ఆధిపత్యం పెరిగింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకి మాత్రమే కేరాఫ్ గా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తదనం ప్లస్ కమర్షియల్ కలగలిపిన సినిమాలతో ఇండియన్ సినిమాని రూల్ చేస్తోంది. తెలుగులోనే మొట్టమొదటి సారిగా భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. ఇప్పుడు కూడా ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న కల్కి2898 ఏడీ మూవీ టాలీవుడ్ నుంచే వస్తోంది.

ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని టాలీవుడ్ సినిమాలు పెంచుకుంటూ వెళ్తున్నాయి. మనల్ని అనుసరిస్తూ బాలీవుడ్, కోలీవుడ్ భారీ బడ్జెట్ తో మూవీస్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తెలుగు నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే రాలేదు. అన్ని వంద కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కినవే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఒక్క సలార్ మాత్రమే ఈ సంవత్సరంలో టాలీవుడ్ నుంచి రాబోయే భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాలి.

అయితే వచ్చే ఏడాది మాత్రం 200 కోట్లకి పైగా బడ్జెట్ తెరకెక్కుతోన్న సినిమాలు అన్ని వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో సిద్ధమవుతోన్న దేవర రిలీజ్ పరంగా ముందు వరుసలో ఉంది. అలాగే కల్కి2898 ఏడీ కూడా వచ్చే ఏడాది వేసవిలోపు రిలీజ్ కావొచ్చు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న OG మూవీ కూడా వేసవి లోపే థియేటర్స్ లోకి రానుంది.

పుష్ప 2 చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవ్వనుంది. సలార్ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న సలార్ పార్ట్ 2 మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఇలా అరడజను భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానున్నాయి.

ఈ చిత్రాలపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. కచ్చితంగా వీటిలో రెండు, మూడు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటాయని అంచనా వేస్తున్నారు. కల్కి2898 ఏడీ మూవీ అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీటితో పాటుగా విజయ్ దేవరకొండ, నాని సినిమాలు కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ కానున్నాయి.