Begin typing your search above and press return to search.

సలార్ సహాయకుడితో దిల్ రాజు ప్రయోగం!

టాలీవుడ్ లో స్టార్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాకుండా సెకండ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మొదటి చిత్రంగా బలగం మూవీ తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   29 Sept 2023 9:00 PM IST
సలార్ సహాయకుడితో దిల్ రాజు ప్రయోగం!
X

టాలీవుడ్ లో స్టార్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాకుండా సెకండ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మొదటి చిత్రంగా బలగం మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. పలు అవార్డులని సైతం ఈ చిత్రం సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ బంధాలని తట్టిలేపిన చిత్రంగా బలగం మూవీ నిలిచింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండో చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది.

సందీప్ అనే కొత్త దర్శకుడితో కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణం సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సుహాస్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. సందీప్ సలార్ మూవీ రైటింగ్ టీమ్ లో వర్క్ చేసాడంట. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఏకంగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

చిన్న హీరోలలో సుహాస్ కి మంచి గుర్తింపు ఉంది. అతని నుంచి సినిమా వస్తోంది అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుందని ఆడియన్స్ నమ్ముతున్నారు. డీసెంట్ హిట్స్ ని అతను సొంతం చేసుకుంటూ నేచురల్ యాక్టింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఏకంగా సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా రేంజ్ పెరిగినట్లే అని చెప్పాలి.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2లో కూడా సుహాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు సందీప్ దర్శకత్వంలో చేయబోతోన్న సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మినిమమ్ బడ్జెట్ లోనే ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు టీం నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా ఎక్స్ పెక్టేషన్స్ హై అండ్ లోనే ఉంటాయి. మరి వాటిని ఈ చిత్రం ఏ మేరకు అందుకుంటుంది అనేది వేచి చూడాలి. బలగం తరహాలో ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయితే సుహాస్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది.