Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పాన్ ఇండియాలు.. ఈ డేట్లు మారకుంటే బాగుండు!

టాలీవుడ్ లో ఈ ఏడాది వరుస పాన్ ఇండియా సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 April 2024 7:30 AM GMT
టాలీవుడ్ పాన్ ఇండియాలు.. ఈ డేట్లు మారకుంటే బాగుండు!
X

టాలీవుడ్ లో ఈ ఏడాది వరుస పాన్ ఇండియా సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరోసారి టాలీవుడ్ జెండా ఎగరేసే స్థాయిలో ఈ సినిమాలన్నీ ఉన్నాయి. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తోనే ఈ సినిమాలు తెరకెక్కుతూ ఉండటం విశేషం. బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ నిర్మాతలకి కూడా ధైర్యం వచ్చింది. స్టార్ హీరోలతో బలమైన కథని చెప్పి ప్రేక్షకులని మెప్పించగలిగితే పెట్టిన పెట్టుబడి చాలా ఈజీగా వస్తుందని అనుకుంటున్నారు.

కరెక్ట్ గా సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్తే భారీ లాభాలు కూడా వస్తాయని విశ్వసిస్తున్నారు. అందుకే తెలుగు అగ్ర నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ ని ఈ చిత్రాలపై పెడుతున్నారు. ఇక ఈ ఏడాదిలో రిలీజ్ కాబోయే పాన్ ఇండియా సినిమాల వరుస క్రమం చూసుకుంటే ముందుగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఉంది. జూన్ ఆఖరు లేదా జులై 5, 12 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం ఉందంట. పాన్ వరల్డ్ రేంజ్ లో 22 భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ముందుగానే వస్తే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

ఆగస్ట్ 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతామని కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉండటం విశేషం. అయితే ఈ డేట్ కూడా మారుతుందని మద్యమధ్యలో గాసిప్స్ వచ్చినప్పటికీ మేకర్స్ మాత్రం అనుకున్న డేట్ కే వస్తామని ఏదో ఒక హింట్ ఇస్తున్నారు.

నెక్స్ట్ ఆగష్టు 29న నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో సిద్ధమవుతోన్న సరిపోదా శనివారం రిలీజ్ కానుంది. డివివి దానయ్య నాని మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 150 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇక మరో బిగ్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర అక్టోబర్ 10న ముందుకి రానుంది. ఈ డేట్ లో కూడా మార్పులు రావద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ లేదా డిసెంబర్ లో గ్రాండియర్ గా రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న సినిమా కాబట్టి కచ్చితంగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. మొత్తంగా ఈ ఏడాది అనుకున్న డేట్స్ కు ఈ సినిమాలు వస్తే మార్కెట్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.