Begin typing your search above and press return to search.

ఈ వారం టాప్ ఓటీటీ సినిమాలివే..

థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజుల్లోనే మూవీస్ డిజిటల్ మాధ్యమాలలోకి వచ్చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   7 Aug 2023 11:31 AM GMT
ఈ వారం టాప్ ఓటీటీ సినిమాలివే..
X

థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజుల్లోనే మూవీస్ డిజిటల్ మాధ్యమాలలోకి వచ్చేస్తున్నాయి. బిగ్ స్క్రీన్ పై ఏవరేజ్, డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే రెండు వారాలు పూర్తయిన వెంటనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నారు. అందుకే ఎంతో అద్భుతంగా ఉందంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి మూవీస్ చూడటం లేదు. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లోనే మూవీస్ చూస్తున్నారు.

డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా పోటీ పడి కొత్త సినిమాలని కొనుగోలు చేస్తున్నాయి. హీరో రేంజ్ బట్టి ఓటీటీల నుంచి ఆఫర్ ఉంటాయి. పెద్ద హీరోల చిత్రాలు అయితే మూవీకి ఖర్చు పెట్టిన బడ్జెట్ లో 50 నుంచి 60 శాతం డిజిటల్ రైట్స్ రూపంలో వచ్చేస్తాయి. ఈ విషయాన్ని నిర్మాతలే స్వయంగా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం థియేటర్స్ తరహాలోనే ఓటీటీలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే అశ్విన్ కుమార్ హీరోగా వచ్చిన హిడింబ ఆహాలో ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రానికి బిగ్ స్క్రీన్ పై మిశ్రమ స్పందన వచ్చింది. కంటెంట్ బాగున్నా కూడా మేకింగ్ పరంగా లోపాలు ఉండటంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అశ్విన్ కుమార్, నందిత శ్వేతా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ గా నటించారు.

మలయాళంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ నెయిమార్. ఐదుగురు యువకుల జీవితాలలోకి కుక్క వచ్చిన తర్వాత వారి లైఫ్ ఎలా మారింది అనే కంటెంట్ తో ఈ చిత్రం ఆగష్టు 8న డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ కాబోతోంది. మలయాళంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ఆడియన్స్ ఆశ్వాదించడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.

హిందీలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఏ కమాండో మూవీ ఆగష్టు 11న హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతోంది. తన అన్నకి కిడ్నాప్ చేసిన వారిని పట్టుకొని, కాపాడుకోవడానికి సోదరుడు చేసే ఆపరేషన్ గా ఈ మూవీ తెరకెక్కింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ చిత్రంలో ఉన్నాయి. వీటితో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న తమిళ్ మూవీ పోర్ తోజిల్ సోనీలివ్ లో ఆగష్టు 11న రిలీజ్ కాబోతోంది.