Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కొత్త భామ‌ల జోరు కొంగొత్త‌గా!

దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రెష్ హీరోయిన్లు? ఎవ‌రు? అంటే ప్ర‌ముఖంగా ఈ న‌లుగురు భామ‌ల పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Feb 2024 10:30 AM GMT
టాలీవుడ్ లో కొత్త భామ‌ల జోరు కొంగొత్త‌గా!
X

సీనియ‌ర్ భామ‌ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌ష్మిక మంద‌న్న‌..శ్రీలీల‌..మృణాల్ ఠాకూర్ లాంటి భామ‌ల్ని చూసి చూసి బోర్ కొట్టేసిన మాట వాస్త‌వ‌మే. కొన్నాళ్ల‌గా ఏ సినిమా చూసిన ఇవే ముఖాలు తెర‌పై క‌నిపిస్తున్నాయి. ఆ భామ‌లు న‌టించిన సినిమాలు విజ‌యం సాధించ‌డంతో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో పాత బ‌డిన ముఖాల్లా మారిపోయాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రెష్ హీరోయిన్లు? ఎవ‌రు? అంటే ప్ర‌ముఖంగా ఈ న‌లుగురు భామ‌ల పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.


వాళ్లే ఆషీకా రంగ‌నాధ్..రుక్మిణి వ‌సంత్.. భాగ్య శ్రీ భోర్సే..వైష్ణ‌వి చైత‌న్య‌. `అమిగోస్` చిత్రంతో క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగ‌నాధ్ ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు అందం..అభిన‌యం టాలీవుడ్ కి తొలి సినిమాతోనే క‌నెక్ట్ అయింది. సినిమా ప్లాప్ అయినా అంద‌మైన హీరోయిన్ అనే ట్యాగ్ ని వేసేసు కుంది. ఇటీవ‌లే `నా సామిరంగ‌`లో నాగార్జున‌కు జోడీగా న‌టించి మ‌రింత ఫేమ‌స్ అయింది. ఈ సినిమా విజ‌యంలో అమ్మ‌డి పాత్ర కీల‌కం కావ‌డంతో ఆషికాకి మంచిపేరు వ‌చ్చింది.

ఈ యువ అందానికి తెలుగులో కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. టైర్- 2 హీరోల‌కు ఈ భామ స‌రితూగుతుంది. పారితోషికం ప‌రంగా నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉంటుంది. దీంతో రానున్న రోజుల్లో ఆషికా మ‌రింత బిజీ కావ‌డం ఖాయం. మ‌రో క‌న్న‌డ బ్యూటీ రుక్మీణ వ‌సంత్ ఇంకా తెలుగులో ఛాన్స్ అందుకోలేదు. మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా ఎంపికైంది.

క‌న్న‌డ చిత్రం `స‌ప్త‌సాగ‌రాలు` రెండు భాగాల‌తో రుక్మిణి టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అలాగే అమ్మ‌డి చేతిలో కొన్ని త‌మిళ సినిమాలు కూడా ఉన్నాయి. `బేబి`తో ఫేమ‌స్ అయిన తెలుగు అమ్మాయి వైష్ణ‌వి కి కూడా కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. యువ హీరోలు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌...అశిష్ రెడ్డి...ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న కొత్త చిత్రాల‌కు ఎంపికైంది. అలాగే మ‌రాఠీ భామ భాగ్య శ్రీ భోర్సే ర‌వితేజ‌కి జోడీగా` మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` లో న‌టిస్తోంది. ఇదే అమ్మ‌డి తొలి తెలుగు సినిమా. భాగ్య అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే ఆమె ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో యువ‌తలో జోష్ క‌నిపిస్తుంది.