Begin typing your search above and press return to search.

60 రోజుల్లో మ‌నోళ్లు ఎందుకు తీయ‌లేక‌పోతున్నారు?

బాలీవుడ్ లో సినిమా పూర్తి చేయ‌డానికి 60 రోజులు స‌రిపోతుంది. కానీ మ‌న ద‌గ్గ‌ర అలాంటి వ్య‌వ‌స్థ ...ప‌రిస్థితులు లేవ‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 9:30 AM GMT
60 రోజుల్లో మ‌నోళ్లు ఎందుకు తీయ‌లేక‌పోతున్నారు?
X

టాలీవుడ్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయ‌డ‌మే కానా క‌ష్టం. అతి క‌ష్టం మీద పూర్తి చేయ‌గ‌ల్గితే ఒక రిలీజ్ తో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటారు. మ‌న‌సులో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాల‌ని ఉన్నా! అది ఎందుక‌నో సాధ్య‌ప‌డ‌టం లేదు. ఈ విష‌యంలో హీరోలు అభిమానుల్ని ఎంత‌గా అసంతృప్తి ప‌రుస్తున్నారో? వాళ్ల‌కి తెలుసు. హీరోలే అభిమానుల్ని క్ష‌మాప‌ణ‌లు అడిగిన సంద‌ర్బాలెన్నో.

సినిమా బ‌డ్జెట్ పెరిగిపోవ‌డం.. స్టోరీ లు కుద‌ర‌కోవ‌డం.. ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో టాలీవుడ్ లో హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయ‌డం అన్న‌ది క‌ష్టంగా మారుతుంది. అటు కోలీవుడ్ లోనూ అదే ప‌రిస్థితి. మాలీవుడ్..శాండిల్ వుడ్ లో మాత్రం టాలీవుడ్..కోలీవుడ్ క‌న్నా చాలా బెట‌ర్ గా ఉంది.ఆ రెండు ప‌రిశ్ర మ‌ల నుంచి ఏటా భారీగానే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మ‌మ్ముట్టి..మోహ‌న్ లాల్ లాంటి అగ్ర హీరోలు ఏడాదికి క‌నీసం ఆరు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు.

ఓవైపు ఇత‌ర భాష‌ల్లో ప‌నిచేస్తూనే సొంత ప‌రిశ్ర‌మ‌ల నుంచి అన్ని సినిమాలు రిలీజ్ చేయ‌గ‌లిగే ఏకైక స్టార్స్. ఇక ఈ విష‌యంలో బాలీవుడ్ ని ఎలా ప‌రిగ‌ణించాలి? అన్న‌ది అర్ధం కాని సందేహం అనాలి. కొంత మంది హీరోలు గ్యాప్ తీసుకున్నంత కాలం తీసుకుని ఒకే ఏడాది మూడు సినిమాల‌కు పైగానే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. షారుక్ ఖాన్ ఇటీవ‌లే 'ప‌ఠాన్'..'జ‌వాన్' చిత్రాలు అలాగే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాటి స‌ర‌స‌న 'డంకీ' కూడా చేరుతుంది.

అమీర్ ఖాన్ కూడా ప్ర‌స్తుతం విరామంలో ఉన్నాడు. ఆయ‌న కూడా సైలెంట్ గా ఒకే ఏడాది.. మూడు.. నాలుగు ప్రాజెక్ట్ ల‌తో బ్లాస్ట్ అవుతుంటారు. స‌ల్మాన్ ఖాన్..హృతిక్ రోష‌న్ కూడా అదే ప‌ద్ద‌తిలో సినిమాలు చేస్తుంటారు. తాజాగా ఇదే స‌న్నివేశాన్ని గుర్తు చేస్తూ ఓ నిర్మాత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. బాలీవుడ్ లో సినిమా పూర్తి చేయ‌డానికి 60 రోజులు స‌రిపోతుంది. కానీ మ‌న ద‌గ్గ‌ర అలాంటి వ్య‌వ‌స్థ ...ప‌రిస్థితులు లేవ‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

బాలీవుడ్ లో ప్ర‌తీ సినిమాకి వ‌ర్క్ షాప్ లు కూడా నిర్వ‌హిస్తార‌ని..వేగంగానూ సినిమాలు చేస్తార‌ని ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూడా గుర్తు చేసారు. అలాంటి ప‌రిస్థితులు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కూడా రావాల ని..హీరోలంతా ఆ ర‌కంగా అంద‌రికీ స‌హ‌క‌రించాల‌ని అన్నారు. కానీ ఇవ‌న్నీ మాట‌ల‌కే ప‌రిమితం అవుతున్నాయి త‌ప్ప ప్రాక్టిక‌ల్ గా సాధ్య‌ప‌డ‌టం లేదు.