Begin typing your search above and press return to search.

2024 సెకండాఫ్.. బ్లాస్ట్ చేయబోతున్న తెలుగు సినిమాలు!

అయితే ఈ ఏడాది తొలి మూడు నెలలు ఇలా గడవగా.. తర్వాత మూడు నెలలంతా ఐపీఎల్, ఎన్నికల సందడే.

By:  Tupaki Desk   |   20 March 2024 4:30 PM GMT
2024 సెకండాఫ్.. బ్లాస్ట్ చేయబోతున్న తెలుగు సినిమాలు!
X

2024.. మరో పది రోజుల్లో మూడు నెలలు పూర్తి చేసుకోనుంది. అయితే టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క భారీ సినిమా కూడా థియేటర్లలో సందడి చేయలేదు. అన్నీ చిన్న చిత్రాలే మెరిశాయి. అలా అని తీసిపారేయకూడదు.. వాటిలో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఏడాది తొలి మూడు నెలలు ఇలా గడవగా.. తర్వాత మూడు నెలలంతా ఐపీఎల్, ఎన్నికల సందడే. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం స్టార్ట్ కానుంది. దీంతో ఈ ఏడాది ఫస్టాఫ్ అయ్యాక సినీ ఇండస్ట్రీలో రివ్యూ చేయడం కష్టమే. ఎందుకంటే సెకండాఫ్ లోనే టాలీవుడ్ కు చెందిన అనేక భారీ ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి.

2024 సెకండాఫ్ లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రేక్షకుల ముందుకు భారీ సినిమాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు డేట్స్ ఫిక్స్ చేసుకోగా.. త్వరలోనే మరిన్ని ఖరారు చేసుకోనున్నాయి. సెకండాఫ్ లో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బోణీ వేయనుంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఇటు ఫ్యాన్స్ తోపాటు అటు సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఆ తర్వాత నెలలో పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా విడుదల కానుంది. గతంలో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయిన డేట్ కే ఓజీ విడుదలను ఫిక్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఫ్రీ అయ్యాక ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయనున్నారు.

ఇక దసరా కానుకగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర విడుదల కానుంది. నిజానికి ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మేకర్స్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ మూవీ రెండో పార్ట్ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

అయితే దసరా రేసులో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి సినిమాలు తండేల్, NBK 109 అక్టోబర్ లోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ ఏడాది చివరలో డిసెంబర్ 25వ తేదీన రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారట. అయితే ఈ ఏడాది ఫస్టాఫ్ లో విడుదల కావాల్సి ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ కల్కి.. సెకండాఫ్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మేకర్స్.. మే9వ తేదీన కల్కి రిలీజ్ అవుద్దని పలుమార్లు ప్రకటించినా.. ఎన్నికల వల్ల ఈ సినిమా విడుదల వాయిదాపడడం పక్కా. ఎందుకంటే మే13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అందుకే ఇప్పుడు వాయిదా వేసి.. డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో చూడాలి. మొత్తానికి 2024 సెకండాఫ్ లో భారీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయన్నమాట.