Begin typing your search above and press return to search.

మెగాస్టార్..మాస్ రాజా ఒకేసారి రంగంలోకి!

మెగాస్టార్ చిరంజీవి ..మాస్ రాజా ర‌వితేజ ఒకేసారి రంగంలోకి దిగ‌బోతున్నారా? ఇద్ద‌రు ఒకే నెల‌ని ముహూర్తంగా ఫిక్స్ చేసారా? అంటే అవుననే తెలుస్తోంది

By:  Tupaki Desk   |   17 Nov 2023 6:13 AM GMT
మెగాస్టార్..మాస్ రాజా ఒకేసారి రంగంలోకి!
X

మెగాస్టార్ చిరంజీవి ..మాస్ రాజా ర‌వితేజ ఒకేసారి రంగంలోకి దిగ‌బోతున్నారా? ఇద్ద‌రు ఒకే నెల‌ని ముహూర్తంగా ఫిక్స్ చేసారా? అంటే అవుననే తెలుస్తోంది. చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో 156వ చిత్రం ఇప్ప‌టికే ప్రారంభోత్స‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌వ‌ర‌కూ రెగ్య‌ల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌లేదు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా డిలే జ‌రిగింది.

అయితే ఈ నెల‌ఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మొద‌టి షెడ్యూల్ నే యాక్ష‌న్ తొ మొద‌లు పెట్ట‌బోతున్నారుట‌. సినిమా కోసం చిరంజీవి ప్ర‌త్యేకంగానూ స‌న్న‌దం అవుతున్నారు. సోషియా ఫాంట‌సీ నేప‌థ్యం కావ‌డం..ఇలాంటి క‌థ‌లో చిరంజీవి క‌నిపించి చాలా కాల‌మ‌వ్వ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ఇందులో న‌లుగురైదుగురు హీరోయిన్లు ఉంటార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అనుష్క పేరు మెయిన్ లీడ్ లో భాగంగా బ‌లంగా వినిపిస్తుంది. ఇంకా చిరు వ‌య‌సు మ్యాచ్ చేసే సీనియ‌ర్ నాయిక‌ల కోసం వేట కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. విజువ‌ల్ వండ‌ర్ గా చిత్రాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇక ఇదే నెల‌ఖ‌రులోనే మాస్ రాజా ర‌వితేజ‌-గోపీచంద్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మైన సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా షురూ కానుంది. రాజా షూటింగ్ సైతం భారీ యాక్ష‌న్ షెడ్యూల్ తోనే మొద‌లు పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందుతున్న చిత్ర‌మిది. పైగా వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో మంచి స‌క్సెస్ రేట్ ఉంది. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఒకే నెల‌లో చిరంజీవి..ర‌వితేజ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వ‌డం..అందులోనూ యాక్ష‌న్ షెడ్యూల్ తో షురూ అవ్వ‌డం ఇదే తొలిసారి. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకోలేదు. చిరంజీవి స్పూర్తితోనే ర‌వితేజ సినిమాల్లోకి పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడా స్టార్ తో స‌మానంగా సినిమాలు చేస్తున్నాడు.