Begin typing your search above and press return to search.

ఈ వారం ఒక్కటి క్లిక్కయినా పండగే..

ఈ వారం అక్టోబర్ 6న టాలీవుడ్ లో చిన్న సినిమాల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాలు అన్ని కూడా విభిన్న జోనర్ లో వస్తున్నవి కావడం విశేషం

By:  Tupaki Desk   |   3 Oct 2023 8:11 AM GMT
ఈ వారం ఒక్కటి క్లిక్కయినా పండగే..
X

ఈ వారం అక్టోబర్ 6న టాలీవుడ్ లో చిన్న సినిమాల సందడి కనిపిస్తోంది. ఈ సినిమాలు అన్ని కూడా విభిన్న జోనర్ లో వస్తున్నవి కావడం విశేషం. వీటిలో ఏ ఒక్క మూవీ క్లిక్ అయిన కూడా ఓ పదిరోజుల పాటు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి స్కోప్ ఉంది. ప్రస్తుతం రాబోయే సినిమాలలో కొన్నింటికి మంచి బజ్ కూడా ఉంది. ఈ చిత్రాల సంగతి చూసుకుంటే మంత్ ఆఫ్ మధు మూవీకి మంచి హైప్ ఉంది.

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర లీడ్ రోల్ లో కల్ట్ లవ్ స్టొరీగా ఈ చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా మూవీ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ రూల్స్ రంజన్. ఈ సినిమాలో సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. కిరణ్ అబ్బవరం కూడా రూల్స్ రంజన్ తో హిట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

సుదీర్ బాబు ట్రిపుల్ రోల్ లో హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మామా మశ్చీంద్ర. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయడంలేదు. దీంతో సుదీర్ బాబు మూవీ అయినా కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో మ్యాడ్ సినిమా కూడా అక్టోబర్ 6న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా 800 మూవీ అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపైన కొంత హైప్ ఉన్నా కూడా తెలుగులో ఏ మేరకు ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనేది చూడాలి. అలాగే సిద్ధార్ హీరోగా స్వీయ నిర్మాణంలో చేసిన వచ్చిన చిన్నా మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.

మరి ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే చిన్న సినిమాలలో ఏది పెద్ద హిట్ అందుకొని బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి సినిమాకి సక్సెస్ కావడానికి ఎంతో కొంత స్కోప్ అయితే ఉంది.