Begin typing your search above and press return to search.

నాగార్జున అసలెందుకిలా..?

ఏది ఏమైనా కింగ్ నాగార్జున సోలోగా సక్సెస్ రేట్ తగ్గడంతో ప్రస్తుతం ఇతర హీరోలతో కలిసి కాంబినేషన్ లో మూవీస్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోన్న టాక్.

By:  Tupaki Desk   |   24 April 2024 4:46 AM GMT
నాగార్జున అసలెందుకిలా..?
X

టాలీవుడ్ లో సీనియర్ హీరోల జాబితాలో ఉన్న కింగ్ నాగార్జున గత కొన్నేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోవడం లేదు. 2016లో కింగ్ నాగార్జున ఊపిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తరువాత వరుసగా ఫ్లాప్ లు సొంతం చేసుకున్నారు. మళ్ళీ 2021లో వచ్చిన బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకున్నారు.

బంగార్రాజు తర్వాత ది ఘోస్ట్ మూవీ డిఫరెంట్ యాక్షన్ కథాంశంతో నాగార్జున చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ ఈ ఏడాది నా సామిరంగా మూవీతో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎనిమిదేళ్లలో నాగార్జున కథలో రెండే హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ కారణంగా సోలోగా నాగార్జున మార్కెట్ కూడా బాగా పడిపోయింది.

దీంతో కింగ్ రూట్ మార్చారు. ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో కూడా నాగ్ కొన్ని గెస్ట్ రోల్స్ చేశాడు. కానీ ఈ మధ్య వరుసగా స్పెషల్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే హిందీలో బ్రహ్మాస్త్ర మూవీలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించి మెప్పించాడు. గతంలో నానితో కలిసి దేవదాసు సినిమాని మల్టీ స్టారర్ గా కింగ్ నాగార్జున చేశారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న కుభేర సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నారు.

ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న మాజీ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున కనిపించబోతున్నాడంట. అలాగే ఓ స్టార్ హీరో చిత్రంలో కూడా కింగ్ నాగార్జున నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం. అది రజినీకాంత్ లోకేష్ సినిమా అని ఒక టాక్ అయితే నడుస్తోంది.

అలాగే బంగార్రాజు సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ ని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పటికే కథ సిద్ధం చేసి నాగార్జునకి వినిపించారంట. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చే ఏడాది 100వ సినిమాని భారీ బడ్జెట్ తో నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన తనయుడు అఖిల్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీని నాగార్జున చేయబోతున్నట్లు టాక్.

అయితే దీనికోసం ఎలాంటి కథని ఎంపిక చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కింగ్ నాగార్జున సోలోగా సక్సెస్ రేట్ తగ్గడంతో ప్రస్తుతం ఇతర హీరోలతో కలిసి కాంబినేషన్ లో మూవీస్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోన్న టాక్. మర్రి రాబోయే రోజుల్లో టాలీవుడ్ మన్మథుడు ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.