Begin typing your search above and press return to search.

ఓ వైపు యాంకర్ కొడుకు.. మరోవైపు సింగర్ వారసుడు

తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుమ సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:53 AM GMT
ఓ వైపు యాంకర్ కొడుకు.. మరోవైపు సింగర్ వారసుడు
X

తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుమ సొంతం చేసుకున్నారు. టెలివిజన్ షోల నుంచి సినిమా ఈవెంట్స్ వరకు అన్నింటిని సుమ కవర్ చేసేస్తూ ఉంటారు. అలాగే సెలబ్రిటీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. టాలీవుడ్ అంతా సుమ నామజపం చేస్తూ ఉంటుంది. సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ ఇప్పుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

మరో వైపు గాయనిగా ఎన్నో హిట్ సాంగ్స్ పాడటమే కాకుండా తన స్వరంతో హీరోయిన్స్ ని గాత్రదానం చేసి ప్రేక్షకుల ప్రసంశలు, అభిమానం సొంతం చేసుకున్న సింగర్ సునీత. ఆమె మంచి వక్త కూడా. సింగర్ సునీత తనయుడు ఆకాష్ సర్కారి నౌకరి సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు.

కొడుకులు హీరోలుగా అడుగుపెడుతోన్న సినిమాలు కావడంతో ఇటు సుమ, అటు సునీత తమ పలుకుబడి అంతా ఉపయోగించి ఆయా సినిమాలని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. బబుల్ గమ్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. మంచి రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా ఉందని తెలుస్తోంది. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

ఈ కారణంగా సినిమాకి కొంత బజ్ ఉంది. అయితే ఆకాష్ హీరోగా తెరకెక్కిన సర్కారు నౌకరితో గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ క్లాస్ టచ్ తో గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేసే నిరుద్యోగి కష్టాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లోకి వస్తోంది. బబుల్ గమ్ డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది.

ఈ రెండు సినిమాలు ఆయా హీరోలకి చాలా కీలకం అని చెప్పాలి. ఈ సినిమాలకొచ్చే రిజల్ట్ బట్టి హీరోలుగా వారి కెరియర్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రోషన్ కనకాల తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బబుల్ గమ్ తో యూత్ కి కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. మరి వీరిలో ఎవరికి సక్సెస్ వస్తుందనేది చూడాలి.