Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురికి హీరోయిన్లు చాలా అర్జెంట్!

మెగాస్టార్ చిరంజీవి..కింగ్ నాగార్జున‌..మ్యాచో స్టార్ గోపీచంద్ ల‌కు హీరోయిన్లు వెరీ అర్జెంటా? అంటే అవున‌నే తెలుస్తోంది

By:  Tupaki Desk   |   18 Sep 2023 12:30 PM GMT
ఆ ముగ్గురికి హీరోయిన్లు చాలా అర్జెంట్!
X

మెగాస్టార్ చిరంజీవి..కింగ్ నాగార్జున‌..మ్యాచో స్టార్ గోపీచంద్ ల‌కు హీరోయిన్లు వెరీ అర్జెంటా? అంటే అవున‌నే తెలుస్తోంది. చిరంజీవి క‌థానాయకుడిగా 157వ సినిమాని మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా అనుష్క‌..న‌య‌న‌తార పేర్లు ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చాయి. అలాగే కొంత మంది బాలీవుడ్ భామ‌ల్ని వ‌శిష్ట ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. అనుష్క‌..న‌య‌న‌తార లో ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ ? అన్న దానిపై చాలా మంది అనుష్క కి తొలి ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌ని భావించారు.

ఇంత‌లోనే బాలీవుడ్ బ్యూటీల పేర్లు తెరపైకి వ‌చ్చాయి. మ‌రి తుదిగా ఎవ‌ర్ని తీసుకుంటారు? అన్న‌ది చూడాలి. అలాగే నాగార్జున హీరోగా విజ‌య్ బిన్ని నా సామిరంగ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కింగ్ బ‌ర్త్ డే కానుక‌గా సినిమా ప్ర‌క‌టించారు? గానీ అందులో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ లేదు. ఆయ‌న‌కు వ‌య‌సు 60 దాటిన నేప‌థ్యంలో హీరోయిన్ ఎంపిక క‌ష్టంగానే మారింది.

న‌య‌న‌తార‌.. అనుష్క ..త్రిష లాంటి వాళ్లు ఇప్ప‌టికే న‌టించారు. మ‌ళ్లీ వాళ్ల‌నే రిపిట్ చేస్తే ప్రెష్ ఫీల్ రాదు. వ‌య‌సు ప‌రంగా మ్యాచ్ అయినా ప్రేక్ష‌కుల‌కు కిక్ రాదు. కాబ‌ట్టి విజ‌య్ బిన్ని ఆ ఛాన్స్ తీసుకోరు. ఈయ‌న కూడా కొత్త వారైన బాలీవుడ్ నాయిక‌ల్ని తెర‌పైకి తెస్తున్నారు. అలాగే గోపీచంద్ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ కి హీరోయిన్ ఎంపిక చేయ‌డం ఇబ్బందిగానే ఉంది.

ఆయ‌న క‌టౌట్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ దొర‌క‌డం క‌ష్టంగానే ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. లైమ్ లైట్ లో ఉన్న భామ‌ల్ని చూద్దామంటే వ‌య‌సు వ్య‌త్యాసం పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ ఆయ‌న హైట్.. వెయిట్ స‌రితూగ‌డం క‌ష్ట‌మ‌వుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇలా ముగ్గురి హీరోల సినిమాలు ప్ర‌క‌ట‌నొచ్చిన‌ప్పికీ హీరోయిన్లు సెట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఇంకా ఈ సినిమా సెట్స్ కి వెళ్ల‌లేదు. హీరోయిన్ల ఎంపిక వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని మేకర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.