Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్.. మూడు నెలల్లో 5 హిట్లు!

టాలీవుడ్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆఫ్ సెంచరీకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   21 March 2024 4:30 AM GMT
టాలీవుడ్ బాక్సాఫీస్.. మూడు నెలల్లో 5 హిట్లు!
X

టాలీవుడ్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆఫ్ సెంచరీకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. భారీ బడ్జెట్ మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు అన్ని కూడా థియేటర్స్ లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 5 మూవీస్ మాత్రమే హిట్స్ గా నిలవడం గమనార్హం. దీనిని బట్టి టాలీవుడ్ లో హిట్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి టైమ్ లోనే అసలైన హిట్స్ పడాలి. కానీ ఆ టైమ్ లో ఈసారి అనుకున్నంత రేంజ్ లో బాక్సాఫీస్ షేక్ అవ్వలేదు.

డిఫరెంట్ కంటెంట్ లతో దర్శకులు, హీరోలు ప్రేక్షకుల ముందుకి వస్తోన్న కూడా ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలం అవుతున్నారు. సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. పెద్ద సినిమాలకి ప్రమోషన్స్, మూవీ మీద ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే వస్తాయి.

రిలీజ్ తర్వాత ఆడియన్స్ ని ఎంత మెప్పించారు అనే దానిపై లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ లాంగ్ రన్ నిలబడటంలో చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. చిన్న సినిమాలకి కూడా రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ఉండాల్సిందే. అలాంటి వాటినే ఆదరణ లభిస్తోంది. బజ్ లేని మూవీస్ అలా థియేటర్స్ లోకి వచ్చి ఇలా వెళ్లిపోవడం తప్ప ఒరిగేది ఉండటం లేదు.

ఈ మూడు నెలల్లో చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని లాంగ్ రన్ లో 300 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ ఏడాదిలో హైయెస్ట్ ప్రాఫిట్ మూవీ అంటే హనుమాన్ మాత్రమే అని చెప్పాలి. ఇక అదే టైమ్ లో వచ్చిన కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ హిట్ టాక్ దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ అందుకొని మోస్తరుగా ప్రాఫిట్ అందుకుంది. వరుస డిజాస్టర్స్ చూసిన నాగార్జున మరోసారి పండగ సెంటిమెంట్ తో ఫామ్ లోకి వచ్చేశాడు.

అనంతరం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చిన సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం అందుకుంది. అయితే లాంగ్ రన్ నిలబడి భారీ భారీ కలెక్షన్స్ ని సాధించలేకపోయింది. కానీ పెట్టిన పెట్టుబడికి సినిమా ఒకవైపు థియేట్రికల్ గా మరోవైపు నాన్ థియేట్రికల్ గా మంచి ప్రాఫిట్స్ అందించింది.

ఇక విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి వారంలోనే 10 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా అందుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ కావడంతో వేగంగా హిట్ జాబితాలో చేరింది. ప్రస్తుతం కూడా వీకెండ్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఈ ఏడాది పర్ఫెక్ట్ హిట్ లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇక మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో కార్తికేయ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు వచ్చాయి. 2 కోట్లతో డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేయగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించేసి ప్రాఫిటబుల్ మూవీగా ప్రేమలు మారబోతోంది.