Begin typing your search above and press return to search.

అక్క‌డ జీరోలైనా ఇక్క‌డ మాత్రం హీరోలు!

చ‌దువుకు రాక‌పోతే ఎందుకు ప‌నికిరాన‌ట్లు కాదు. చ‌దువులో రాణించ‌లేక‌పోతే మ‌రో రంగంలో రాణించ డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ప్రోత్స‌హిస్తుంటారు.

By:  Tupaki Desk   |   19 March 2024 10:18 AM GMT
అక్క‌డ జీరోలైనా  ఇక్క‌డ మాత్రం హీరోలు!
X

చ‌దువుకు రాక‌పోతే ఎందుకు ప‌నికిరాన‌ట్లు కాదు. చ‌దువులో రాణించ‌లేక‌పోతే మ‌రో రంగంలో రాణించ డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ప్రోత్స‌హిస్తుంటారు. ఏ రంగంలోనైనా ఫ్యాష‌న్ తో ప‌నిచేస్తే ఉన్న‌త శిఖ‌రాల్ని అధిరోహించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అలా జీవితంలో సక్సెస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్ర‌పంచాన్నే గెలిచిన మేథావులు మ‌రెంతో మంది ఉన్నారు. ఇండ‌స్ట్రీలోనూ అలాంటి వాళ్లు కొంత మంది ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీకొచ్చిన సంగ‌తి తెలిసిందే. `చిరుత‌`తో లాంచ్ అయిన హీరో `మ‌గ‌ధీర‌`తో 100 కోట్ల హీరో అయ్యాడు. అటుపై `ఆర్ ఆర్ ఆర్` విజ‌యంతో 1000 కోట్ల హీరో అయ్యాడు. ఇంకా చ‌ర‌ణ్ మ‌రెన్నో గొప్ప స్థానాల‌కు చేరుకుంటాడు. అత‌డిలో ఆ ప్ర‌తిభ ఉంది. క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉంది. తండ్రి మెగాస్టార్ క‌దా? అని తాను స్టార్ గా స‌క్సెస్ అవ్వ‌లేదు. మెగా కార్డు అనేది ఎంట్రీ వ‌ర‌కే.

ఆ త‌ర్వాత అంత సొంత ట్యాలెంట్ తో నే ఎద‌గాలి. ఆ ర‌కంగా చిరంజీవి గ‌ర్వ‌ప‌డే స్థాయికి చ‌ర‌ణ్ చేరాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చ‌ర‌ణ్ కి పెద్ద‌గా చ‌దువు అబ్బ‌లేద‌ని తానే స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంద‌ర్భాలెన్నో. త‌న‌కు తెలిసిన సినిమాల‌వైపు వ‌చ్చి స‌క్సెస్ అయ్యాను త‌ప్ప‌.. త‌న‌కున్న తెలివి తేట‌ల‌కి చ‌దువుకుంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో? అని చ‌మ‌త్క‌రించాడు. ఇక అల్లు అర‌వింద్ వార‌సుడిగా ఎట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుని రాష్ట‌పతి చేతుల మీదుగానూ అందుకున్నాడు. అప్పుడు బ‌న్నీ ఏమ న్నాడో తెలిసిందే? ప్రిన్సిప‌ల్ ద‌గ్గ‌ర మినిమం స‌ర్టిఫికెట్ తీసుకోని వాడిని..ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు అందుకోవ‌డం క‌ల‌గా ఉందంటూ ఓపెన్ గానే అన్నాడు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ వార‌స‌త్వాన్ని రానా కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో రానికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.

న‌టుడిగా న‌త‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఇక చ‌దువులో తన ట్యాలెంట్ ఏంటి? అన్న‌ది ప‌బ్లిక్ గా చెప్పిన సంద‌ర్భాలెన్నో. అక్క‌డ స‌క్సెస్ కాక‌పోయినా న‌టుడిగా స‌క్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటు న్నాడు. అలాగే మ‌రో హీరో పుత్ర‌ర‌త్నం కూడా అంతే. పెద్ద కుమారుడు చ‌దువులో ఎంతో తెలివైన వారైనా..చిన్న కుమారుడు మాత్రం చ‌దువెక్క‌ని న‌టుడంటూ న‌వ్వించిన సంద‌ర్భాలెన్నో. అయితే వీరంతా పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు వేసిన పునాదితో ఇండ‌స్ట్రీలో బ‌లంగా నిల‌బ‌డి స‌క్సెస్ అయ్యారు. అందుకోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఇష్ట‌పడి చేస్తే ఏప‌ని క‌ష్టం కాదు అన్న చందంగా నిరూపించారు.