Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఓకే అక్కడ మార్కెట్ పై మనోళ్ల పైచేయి ఎప్పుడు..?

ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ని కూడా శాసించే స్థాయికి ఎదిగింది

By:  Tupaki Desk   |   26 March 2024 4:45 AM GMT
బాలీవుడ్ ఓకే అక్కడ మార్కెట్ పై మనోళ్ల పైచేయి ఎప్పుడు..?
X

ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ని కూడా శాసించే స్థాయికి ఎదిగింది. బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అయ్యేలా మన సినిమాలు వస్తున్నాయి. బాహుబలితో రాజమౌళి మొదలు పెట్టిన ఈ విధ్వంసం కొనసాగిస్తున్నారు మన హీరోలు, దర్శక నిర్మాతలు. సినిమా సినిమాకు తమ రేంజ్ పెంచుకుంటూ వెళ్తూ సినీ లవర్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే బాలీవుడ్ మీద కూడా పైచేయి సాధించిన తెలుగు హీరోలు పక్కన ఉన్న కోలీవుడ్ లో మాత్రం వెనకపడి ఉన్నారని చెప్పొచ్చు.

తెలుగు సినిమాలకు.. తెలుగు హీరోలకు తమిళంలో ప్రేక్షకాదరణ తక్కువే. అక్కడ మన వాళ్లకు అంత ఫ్యాన్ బేస్ లేదు. ఏదో సినిమా రిలీజ్ టైం లో మన తెలుగు ప్రేక్షకులు, స్టార్ అభిమానులు చెన్నై సిటీలో హడావిడి చేస్తారు తప్ప కోలీవుడ్ లో మన హీరోల సినిమాలు అంత గొప్ప రికార్డులు సాధించిన చరిత్ర ఏమి లేదు. అదే తమిళ హీరోలైతే టాలీవుడ్ లో రికార్డులు సృష్టించారు. ఇక్కడ మన స్టార్స్ కి ఈక్వల్ గా వారి క్రేజ్ ఉంది. ఇప్పటికీ రజిని, కమల్, విజయ్, సూర్య, ధనుష్ సినిమాలు వస్తున్నాయి అంటే మన వాళ్లు అలర్ట్ అవుతుంటారు.

రజినీకాంత్, కమల్ సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మన స్టార్స్ కి ఈక్వల్ గా వారి క్రేజ్ ఉంటుంది. కానీ కోలీవుడ్ లో మన హీరోల పరిస్థితి వేరుగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు కూడా కోలీవుడ్ లో వెనకపడి ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో మన స్టార్స్ క్రేజ్ తెచ్చుకుంటున్నా కూడా కోలీవుడ్ లో మాత్రం అక్కడ స్టార్స్ రికార్డులను బ్రేక్ చేయడంలో వెనకపడి ఉన్నారు.

కోలీవుడ్ లో విజయ్ టాప్ 1 గా దూసుకెళ్తుండగా ధనుష్ వెరైటీ సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు. సూర్య ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోపక్క సొంత బ్యానర్ లో అద్భుతమైన కథలను చెబుతున్నాడు. రజిని తన మాస్ పంథా కొనసాగిస్తుండగా విక్రం తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ అదే రేంజ్ దూకుడు చూపిస్తున్నాడు.. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల రికార్డులు భారీగా కొనసాగుస్తున్నా కోలీవుడ్ లో మాత్రం అది లెక్క తప్పుతుంది. సో మన వాళ్లు కోలీవుడ్ బాక్సాఫీస్ మీద పైచేయి సాధించే రోజు కోసం తెలుగు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు.