Begin typing your search above and press return to search.

హీరోలంతా ఎవ‌రెక్క‌డ‌? ఎంత బిజీలో!

ఎండ‌ల వేడి తీవ్ర‌త పెరుగుతుంది. దీంతో షూటింగ్ ల‌న్నీ వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని చ‌క‌చ‌కా షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు

By:  Tupaki Desk   |   20 March 2024 3:30 PM GMT
హీరోలంతా ఎవ‌రెక్క‌డ‌? ఎంత బిజీలో!
X

ఎండ‌ల వేడి తీవ్ర‌త పెరుగుతుంది. దీంతో షూటింగ్ ల‌న్నీ వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని చ‌క‌చ‌కా షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. చిత్రీక‌ర‌ణ ద‌గ్గ‌ర ప‌డిన సినిమాలు త‌ప్ప మిగిలిన చిత్రాల యూనిట్ లు అన్ని నెమ్మ‌దిగానే షూటింగ్ నిర్వ‌హిస్తున్నాయి. ఎండ‌లు మ‌రింత ఎక్కువైతే రెండు నెల‌లు పాటు విరామం ప్ర‌క‌టించాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు స్టార్ హీరోలు లేకుండా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే...

మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా విశ్వంభ‌ర షూట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. తొలి షెడ్యూల్ మారేడు మిల్లి షూట్ లో మెగాస్టార్ జాయిన్ కాక‌పోవ‌డంతో రెండ‌వ షెడ్యూల్ నుంచి జాయినింగ్ డేట్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ గ్యాప్ లేకుండా షూట్ చేసారు. తాజాగా ఈ వారం బ్రేక్ ప్ర‌క‌టించింది యూనిట్. ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి కూడా నెల‌కొన‌డంతో ఈ రెండు నెల‌లు పాటు చిరు కూడా బ్యాకెండ్ పాలిటిక్స్ లో బిజీ అవుతార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇక పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898' షూటింగ్ శంకరపల్లిలో శ‌ర వేగంగా జరుగుతోంది. ఇందులో కీల‌క న‌టులంతా పాల్గొంటున్నారు. త‌దుప‌రి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నారు. మే లో రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి టీమ్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తుంది. అలాగే యూత్ స్టార్ నితిన్ హీరోగా న‌టిస్తోన్న 'రాబిన్ హుడ్' షూటింగ్ నాంప‌ల్లిలో జ‌రుగుతోంది. అక్క‌డ నితిన్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇక 'పుష్ప‌-2 'షూటింగ్ వైజాగ్ పోర్ట్ లో షూట్ పూర్తి చేసుకున్న వెంట‌నే గ్యాప్ లేకుండా ఆర్ ఎఫ్ సీలో కంటున్యూటీ షూట్ న‌డుస్తోంది. అలాగే న‌ట‌సింహ బాలకృష్ణ‌-బాబి సినిమా కూడా గ్యాప్ తీసుకోలేదు. బాల‌య్య రాజ‌కీయ స‌మావేశాల్లో పాల్గొంటూనే ఈ సినిమా షూటింగ్ కి హాజ‌ర‌వ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. ఇక రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతోంది.

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న 'తండేల్' చిత్రీక‌ర‌ణ బీహెచ్ ఈఎల్ లో జ‌రుగుతోంది. అక్క‌డ పాకిస్తాన్ జైలు సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నారు. అదే ప్రాంతంలో నాని న‌టిస్తోన్న 'స‌రిపోదా శ‌నివారం' కూడా తెర‌కెక్కుతోంది. అలాగే శర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు ద‌ర్శ‌క త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం షూటింగ్ కోటీలో జ‌రుగుతోంది.