Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్లి హడావుడి

ఆ ఫ్యామిలీ ఉన్న హోదా నేపథ్యం లో ఈ పెళ్లి భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయి

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:21 AM GMT
టాలీవుడ్‌ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్లి హడావుడి
X

టాలీవుడ్‌ లో వరుసగా యంగ్‌ హీరోలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. అదే ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్‌ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో టాలీవుడ్ కి చెందిన మరో ప్రముఖ ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్లి చర్చలు జరుగుతున్నాయి అంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఫ్యామిలీకి బంధువుల ఫ్యామిలీ అమ్మాయిని ఎంపిక చేశారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఆ ఫ్యామిలీ ఉన్న హోదా నేపథ్యం లో ఈ పెళ్లి భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల హీరోగా అతడు ఎంట్రీ ఇచ్చాడు. ఇంకొన్నాళ్ళు తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెడితే బాగుంటుంది కదా అదే ఫ్యామిలీకి చెందిన వారు అంటున్నారట.

ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని.. అతి త్వరలోనే పెళ్లి గురించి ఫ్యామిలీ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పెళ్లి గురించి చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలోనే నిశ్చితార్థం జరిపి ఆ తర్వాత అధికారికంగా పెళ్లి గురించి ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.