Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్స్.. గ్యాప్ ఎక్కువైంది

అయితే సినిమా బడ్జెట్ పెరుగుతున్న కొద్ది షూటింగ్ లో వేగం తగ్గిపోయింది. 24 గంటలు షూటింగ్ కోసం టైం స్పెండ్ చేయడానికి హీరోలు సిద్ధంగా లేరని చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Feb 2024 7:30 AM GMT
టాలీవుడ్ స్టార్స్.. గ్యాప్ ఎక్కువైంది
X

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు తక్కువ కాకుండా చేస్తూ ఉండేవారు. అలాగే మూవీ షూటింగ్స్ కూడా షిఫ్ట్స్ వైజ్ గా చేసేవారు. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉండేవారు. అయితే సినిమా బడ్జెట్ పెరుగుతున్న కొద్ది షూటింగ్ లో వేగం తగ్గిపోయింది. 24 గంటలు షూటింగ్ కోసం టైం స్పెండ్ చేయడానికి హీరోలు సిద్ధంగా లేరని చెప్పాలి.

దాంతో పాటు షెడ్యూల్, షెడ్యూల్ కి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్నారు. కొంతమంది అయితే రెండేళ్లకి పైగా గ్యాప్ కూడా తీసుకుంటున్నారు. సినిమాల షూటింగ్ సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి. ఈ కారణంగా ప్రేక్షకుల ముందుకి రావడంలో ఆలస్యం అవుతుంది.

రామ్ చరణ్ తో శంకర్ గేమ్ చేంజర్ స్టార్ట్ చేసి రెండేళ్లకి పైగా అవుతోంది. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ పై స్పష్టత లేదు. డార్లింగ్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. కల్కి రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొని మే లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది అనుకుంటే అది కూడా డౌట్ లోనే ఉంది. రాజాసాబ్ రిలీజ్ పై స్పష్టత లేదు.

ఎన్టీఆర్ దేవర మూవీ స్టార్ట్ చేయడమే ఆలస్యంగా చేశారు. ఏప్రిల్ రిలీజ్ అని చెప్పి మళ్ళీ అక్టోబర్ కి వాయిదా వేశారు. అప్పుడైనా కన్ఫర్మ్ గా రిలీజ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా మూడేళ్ళ నుంచి జరుగుతోంది. దాని స్టేటస్ ఏంటనేది తెలియదు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పైన ఉన్న రిలీజ్ పై డౌట్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి మూడేళ్ళ వరకు సినిమా వచ్చే అవకాశం లేదు. రాజమౌళి మహేష్ తో ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది క్లారిటీ లేదు. ఇక దాని రిలీజ్ రాజమౌళికి కూడా తెలియకపోవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ తో చేస్తోన్న పుష్ప 2 మూవీ సుదీర్ఘంగా 2.5 ఏళ్ళ నుంచి నడుస్తోంది. ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇలా స్టార్ హీరోల చిత్రాలన్నీ కూడా నత్తనడకగానే సాగుతూ ఉండటం విశేషం. ఈ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ సినిమాలు విషయంలో పెద్ద కన్ఫ్యూజనే నెలకొంది.