Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోయిన్లకు 1+1 ఆఫర్లు!

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లకు 1+1 ఆఫర్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ ముద్దుగుమ్మ అయినా సరే ఒక సినిమా చేస్తే చాలు, వెంటనే మరో ప్రాజెక్ట్ ను ఆఫర్ చేస్తున్నారు మన నిర్మాతలు.

By:  Tupaki Desk   |   6 March 2024 2:30 AM GMT
టాలీవుడ్ హీరోయిన్లకు 1+1 ఆఫర్లు!
X

ఒక దర్శకుడికి తాను రాసుకున్న క‌థ‌లో హీరోయిన్ పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతారు, ఎవ‌రితో చేయిస్తే ఆ క్యారెక్టర్ బాగా పండుతుందనేది తెలుస్తోంది. హీరో గారి కోరిక మేరకు, లేదా మార్కెట్ లో ఉన్న డిమాండ్ మేరకు కథానాయికలకు ఎంపిక చేసుకునే ఫిలిం మేకర్స్ కూడా వున్నారు. అలానే ఆల్రెడీ కలిసి పని చేసిన హీరోయిన్ల వైపు మొగ్గు చూపేవారు కొందరుంటారు. రెమ్యునరేషన్లు, పెరఫార్మన్స్, కంఫ‌ర్ట్ జోన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లకు 1+1 ఆఫర్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ ముద్దుగుమ్మ అయినా సరే ఒక సినిమా చేస్తే చాలు, వెంటనే మరో ప్రాజెక్ట్ ను ఆఫర్ చేస్తున్నారు మన నిర్మాతలు.

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే, అదే సంస్థలో రూపొందుతున్న 'సరిపోదా శనివారం' సినిమాలోనూ ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో నాని హీరోగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అంతకుముందు 'భరత్ అనే నేను' చిత్రంలో నటించిన కియారా అద్వానీని, 'వినయ విధేయ రామ' మూవీ కోసం ఒప్పించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన 'DJ టిల్లు' బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత, హీరోయిన్ నేహా శెట్టిని మరో మూవీలో తీసుకున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో నేహాను భాగం చేశారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ. అదే ప్రొడక్షన్ లో గతంలో 'అ ఆ', 'ప్రేమమ్' వంటి చిత్రాల్లో నటించిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు 'DJ టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందించారు.

'ఆదికేశవ్' మూవీ రిలీజ్ అవ్వకముందే హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. పూజా హెగ్డే తప్పుకున్న తర్వాత మహేష్ బాబుకు జోడీగా ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ చేశారు. అంతేకాదు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రానున్న 'VD 12' చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత', 'అల వైకుంఠపురంలో' చిత్రాల్లో పూజా హెగ్డేని హీరోయిన్ గా నటించింది. 'గుంటూరు కారం' అవకాశం మిస్ అయినా, అదే బ్యానర్ లో మరో మూవీ ఆఫర్ ఉందనే రూమర్స్ ఉన్నాయి. ఇక సితార బ్యానర్ లోనే 'భీమ్లా నాయక్' చిత్రంలో నటించిన సంయుక్త మీనన్.. 'సార్' సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది. 'గుంటూరు కారం' లో మహేశ్ మరదలి పాత్ర పోషించిన మీనాక్షి చౌదరి.. ఇప్పుడు నాగ వంశీ నిర్మిస్తున్న 'లక్కీ భాస్కర్' మూవీలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా కనిపిస్తోంది.

గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'గీత గోవిందం' సినిమాలో నటించిన రష్మిక మందన్న.. ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. అంతకముందు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన రష్మికనే.. 'వారసుడు' లో హీరోయిన్ గా తీసుకున్నారు నిర్మాత దిల్ రాజు. 'డియర్ కామ్రేడ్' మూవీ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్', 'పుష్ప: ది రూల్' చిత్రాల్లో నేషనల్ క్రష్ భాగమైంది.

'మట్కా' సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న SRT ఎంటర్టైన్మెంట్స్.. తమ బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కించనున్న 'VS 10' సినిమాలోనూ మీనాక్షినే హీరోయిన్ గా తీసుకున్నారు. మిర్చి, భాగమతి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాల్లో అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకున్న యూవీ క్రియేషన్స్.. ఇప్పుడు ఆమెతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇలా మన టాలీవుడ్ నిర్మాతలందరూ హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసి, ఆల్రెడీ వర్క్ చేసిన కథానాయికలను వాటిల్లో భాగం చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద వుండగానే, హీరోయిన్లకు మరిన్ని ఆఫర్లు అందిస్తున్నారు.