Begin typing your search above and press return to search.

ఆ సీన్స్ తో OTTలోకి వచ్చేసిన బేబీ, బ్రో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఇంత కాలం థియేటర్ ఆడియెన్స్ ను అలరించిన ఈ చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా రచ్చ చేసేందుకు రెడీ అయిపోయాయి

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:22 AM GMT
ఆ సీన్స్ తో OTTలోకి వచ్చేసిన బేబీ, బ్రో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
X

ఎప్పుడెప్పుడా సినీ అభిమానులు ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వారి ఎదురుచూపులకు నేటితో పుల్ స్టాప్ పడింది. అదే బేబీ, బ్రో ఓటీటీ రిలీజ్. ఈ వారం చాలానే సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతున్నా.. ముఖ్యంగా ఆ రెండు చిత్రాల కోసమే ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తున్నారు.

ఇంత కాలం థియేటర్ ఆడియెన్స్ ను అలరించిన ఈ చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా రచ్చ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆగస్ట్ 25నుంచి ఈ చిత్రాలు రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. చెప్పినట్టుగానే ఈ సినిమాలు ఆగస్ట్ 24వ తేదీ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీంతో మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బ్రో సినిమా విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే ఇది. తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిచారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహారించారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ తో పాటు పలు వివాదాలను కూడా ఎదుర్కొంది. ఇప్పుడు ఆగస్టు 25నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇకపోతే జులై 14న చిన్న చిత్రంగా విడుదలై.. బాక్సాఫీస్ సెన్సేషనల్ సృష్టించింది బేబీ. కల్డ్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని.. సినీ లవర్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) నిర్మించారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. దాదాపు రూ.75 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో కొన్ని అదనపు సన్నివేశాలను కూడా యాడ్ చేశారు.

మీరి మీరు కనుక ఈ రెండు చిత్రాలను థియేటర్లలో చూసినా, చూడకపోయినా.. వీకెండ్ ఎలాగో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఎంచక్కా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేయండి..