Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కే ద‌డ‌పుట్టిస్తోన్న టాలీవుడ్!

టాలీవుడ్ ని చూస్తే బాలీవుడ్ కే ద‌డ‌పుడుతుంది. అవును ! ద‌డ‌పుట్ట‌దా మ‌రి? ఒక ద‌ర్శ‌కుడు తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చాడు

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:30 PM GMT
బాలీవుడ్ కే ద‌డ‌పుట్టిస్తోన్న టాలీవుడ్!
X

టాలీవుడ్ ని చూస్తే బాలీవుడ్ కే ద‌డ‌పుడుతుంది. అవును ! ద‌డ‌పుట్ట‌దా మ‌రి? ఒక ద‌ర్శ‌కుడు తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చాడు. మ‌రో ద‌ర్శ‌కుడు 1000 కోట్లు తెచ్చే హిందీ సినిమానే అక్క‌డ‌కెళ్లి డైరెక్ట్ చేసాడు. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ ని సైతం వ‌సూళ్ల‌తో షేక్ చేసాయి. ఇది చాల‌దా? టాలీవుడ్ రేంజ్ చెప్ప‌డానికి. మ‌నోళ్ల ప్ర‌తిభావంతుల‌ని ప్రూవ్ చేయ‌డానికి.

బాలీవుడ్ హీరోలే రాజ‌మౌళి...సందీప్ వంగ‌..సుకుమార్ లాంటి టాప్ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి రెడీగా ఉన్నారు. ప్ర‌భాస్..ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్‌..బ‌న్నీ లాంటి స్టార్ల‌కు బాలీవుడ్ నుంచి గ్రాండ్ గా వెల్క‌మ్ అందుతోంది. రండి మా ప‌రిశ్ర‌మ‌కొచ్చి హిందీ సినిమాలు చేయండి. ఎన్నికోట్లు అయినా పారితోషికంగా ఇస్తామంటూ బ‌డా నిర్మాణ సంస్థ‌లెన్నో క్యూలో ఉన్నాయి. అందుకే క‌దా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్-2' లో భాగ‌మయ్యాడు.

స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో త‌ల‌ప‌డుతున్నాడు? ఇది చాల‌దా? బాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాం అని చెప్ప‌డానికి. బాలీవుడ్ హీరోలంతా తెలుగు సినిమావైపు తొంగి చూస్తున్న త‌రుణం ఇది. అమీర్ ఖాన్..స‌ల్మాన్ ఖాన్.. షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు తెలుగు ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. ఇన్నాళ్లు టాలీవుడ్ అంటే చిన్న చూపుగా చూసిన ఎంతో మంది ఉద్దండులంతా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు.

ప్ర‌శాంత్ నీల్.. నాగ్ అశ్విన్..చందు మొండేటి..లోకేష్ క‌న‌గరాజ్ లాంటి సౌత్ మేక‌ర్లకు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. వారి గ‌త చిత్రాలు బాలీవుడ్ లో మంచి వ‌సూళ్లు సాధించ‌డంతో భ‌విష్య‌త్ అగ్ర ద‌ర్శ‌కులు వీళ్లే అని ఓ సంకేతం పాస్ చేసారు. ఇలాంటి వారితో మ‌రిన్ని వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డానికి ఆస్కారం ఉంద‌ని టాలీవుడ్ స‌హా బాలీవుడ్ గ‌ట్టిగా విశ్వ‌శిస్తుంది. ఆ న‌యా ద‌ర్శ‌కుల‌పై క‌ళ్లు మూసుకుని ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేయోచ్చ‌ని ప‌రిశ్ర‌మ‌లు భావిస్తున్నాయి.