Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ చెప్పు దెబ్బ!

నాలుగైదేళ్ల క్రితంతో పోలిస్తే అన్ని బాలీవుడ్ మీడియాల్లో టాలీవుడ్ గురించి సౌత్ సినిమాల గురించి స్టోరీలు పెరిగాయి. వార్త‌లు పెరిగాయి

By:  Tupaki Desk   |   15 Oct 2023 12:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ చెప్పు దెబ్బ!
X

కాలంతో పాటు ట్రెండ్ మారింది. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అయింది. తెలుగు సినిమాతో పోటీప‌డుతూ మ‌న‌ సినిమాని అనుస‌రిస్తూ ద‌క్షిణాదిన ఇత‌ర సినీప‌రిశ్ర‌మ‌లు జాతీయ స్థాయిలో గ్రిప్‌ని పెంచుకుంటున్నాయి. ఇటీవ‌లి కాలంలో జాతీయ మీడియాలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న మార్పు ఇది. టాలీవుడ్ వెంటే ఇటీవ‌ల క‌న్న‌డ ప‌రిశ్ర‌మ వెలుగులు విర‌జిమ్ముతోంది. కోలీవుడ్ ప్రాంతీయ‌త అంశం నుంచి బ‌య‌ట‌ప‌డుతోంది. మారిన ఈ ప‌రిణామం గురించి ఇప్పుడు చ‌ర్చించి తీరాలి. తెలుగు-త‌మిళం-క‌న్న‌డ సినీప‌రిశ్ర‌మ‌ల్ని ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు నేష‌న‌ల్ మీడియా ప్ర‌త్యేకంగా చూస్తోంది. ఇప్పుడిప్పుడే ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్స్ తో అంత‌ర్జాతీయ మీడియా దృష్టిని మ‌న‌వైపు మ‌ర‌ల్చ‌డంలో తెలుగు సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. టాలీవుడ్ సాహ‌సోపేత‌మైన అడుగులు ఇప్పుడు దేశీ సినిమాకి దిశానిర్ధేశ‌నం చేస్తుండ‌డం కొత్త ప‌రిణామం. అస‌లు తెలుగు సినిమా అంటే కేవ‌లం ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా అని భావించేవారికి ఈ మార్పు చెప్పు దెబ్బ లాంటిది.

నాలుగైదేళ్ల క్రితంతో పోలిస్తే అన్ని బాలీవుడ్ మీడియాల్లో టాలీవుడ్ గురించి సౌత్ సినిమాల గురించి స్టోరీలు పెరిగాయి. వార్త‌లు పెరిగాయి. కంటెంట్ కి ప‌ట్టంగ‌ట్టే వాళ్లు పెరిగారు. ఒక ర‌కంగా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా సౌత్ కంటెంట్ ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాల్లో పుల్ అవుతోంది. దీనిని పాన్ ఇండియా ట్రెండ్ అనాలా? లేక పాన్ వ‌ర‌ల్డ్ ట్రెండ్ అని పిల‌వాలా? ఎలా పిలిచినా మ‌న సినిమా ఖ్యాతి పెరిగిందన‌డానికి ఇది సింబాలిక్.

ఇది అసాధార‌ణ ప‌రిణామం.. బాహుబ‌లి తో మొద‌లై అటుపైనా ప్ర‌భాస్ సినిమాలతో ఈ కొత్త ట్రెండ్ పురుడు పోసుకుంది. ఇటీవ‌ల‌ ఆర్.ఆర్.ఆర్ .. పుష్ప‌.. కేజీఎఫ్ ఫ్రాంఛైజీ సినిమాలు.. వీటితో మొద‌లైన ట్రెండ్ పీక్స్ కి చేరుకుంది. ఇప్పుడు తెలుగులో ప్ర‌తి హీరో సినిమాకి సంబంధించిన ప్ర‌చారం నేష‌నల్ మీడియాల్లో హైలైట్ అవుతోంది. అలాగే క‌న్న‌డం, త‌మిళ సినిమాల‌కు కూడా ప్ర‌చారం మారింది. బాలీవుడ్ లో పెద్ద మీడియాల‌తో పాటు కింది స్థాయి మీడియాల్లోను మ‌న టాలీవుడ్ వార్త‌లు లేదా సౌత్ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయంటే సీన్ ఎంత‌గా మారిందో అర్థం చేసుకోవాలి. మ‌న సినిమాల రివ్యూలు జెట్ స్పీడ్ తో ఉత్త‌రాదినా వైర‌ల్ అయిపోతున్నాయ్.. మారిన డిజిట‌ల్ ప్ర‌మోష‌న‌ల్ ట్రెండ్ కూడా మ‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు అద‌న‌పు బూస్ట్ ఇస్తోంది.

మారిన ట్రెండ్ ని పరిశీలిస్తే..

*ఇది మ‌న మార్కెట్ ని పెంచింది.

*మ‌న సినిమా ప‌బ్లిసిటీని పెంచింది..

*మ‌న స్టార్ల‌కు పాన్ ఇండియా గుర్తింపును తెచ్చింది.

*చిన్న పెద్ద సినిమాల‌కు ప్ర‌చారం పెరిగింది..

*కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్య‌మేన‌ని ప్రూవైంది..

*ప్ర‌తిభావంతుడికి ఇప్పుడు భాష‌లు స‌రిహ‌ద్దులు లేవు..

*అన్నిచోట్లా అవ‌కాశాల ల‌భ్య‌త‌కు భ‌రోసా పెరిగింది..

*న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు అన్నిచోట్లా రాణించే వెసులుబాటు క‌లిగింది..

మునుముందు ఇంకా ఇంకా ఇది ముందుకు సాగే ప్ర‌క్రియ‌. ఇక‌పైనా ఆస్కార్ వేదిక‌లు స‌హా అంత‌ర్జాతీయ సినిమా పండుగ‌ల్లో తెలుగు సినిమాకి లేదా సౌత్ సినిమాకి ప్ర‌చారం పెర‌గ‌నుంది. ప్ర‌చారంతో పాటు మార్కెట్ రేంజ్ అమాంతం పెర‌గ‌నుంది. అవార్డులు రివార్డుల‌తో పాటు అన్నివిధాలా గుర్తింపు దాంతో పాటే బాక్సాఫీస్ ఆర్జ‌న విధానం అన్నీ మారుతున్నాయి.

మునుముందు హాలీవుడ్ క్రిటిక్స్ లోకి మ‌న సినిమాలు దూసుకెళ్ల‌నున్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో ఇది నెమ్మ‌దిగా మొద‌లైంది. భ‌విష్య‌త్ లో ఇది అమాంతం పెర‌గ‌నుంది. రాజ‌మౌళి- శంక‌ర్- మ‌ణిర‌త్నం- రాజ్ కుమార్ హిరాణీ- సంజయ్ లీలా భ‌న్సాలీ.. ఇలా దిగ్గ‌జాల సినిమాల‌తో పాటు అనూహ్యంగా అత్య‌ద్భుత ప్ర‌తిభ‌తో దూసుకొచ్చే ఇత‌ర ద‌ర్శ‌కర‌చ‌యిత‌ల వ‌ల్ల మ‌న స్థాయి పెరుగుతుందే కానీ త‌ర‌గదు. ఈ అపార‌మైన నిధి ఉన్న గ‌నిని త‌వ్వే కొద్దీ ఫ‌ల‌వంత‌మ‌వుతుంది.