Begin typing your search above and press return to search.

ఆ నలుగురు.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు

తరువాత కొరటాల శివ కూడా స్టార్ డైరెక్టర్ గానే ఉన్నారు. కానీ ఆచార్యతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకొని కొంచెం వెనుకపడ్డారు

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:18 AM GMT
ఆ నలుగురు.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
X

టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ దర్శకులుగా టాప్ చైర్ లో ఉన్నవాళ్లు కొద్దిమంది ఉన్నారు. వారిలో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా టాప్ లో ఉన్నారు. తరువాత పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకోకపోయిన అతని మూవీస్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడొచ్చు అనే అభిప్రాయం జనాల్లో ఉంది.

తరువాత కొరటాల శివ కూడా స్టార్ డైరెక్టర్ గానే ఉన్నారు. కానీ ఆచార్యతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకొని కొంచెం వెనుకపడ్డారు. కానీ అంతకుముందు కొరటాల చేసిన ప్రతి సినిమా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించినవే కావడం విశేషం. టాలీవుడ్ లో వంద కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన సినిమాలలో మెజారిటీ ఈ దర్శకుల నుంచి వచ్చినవే. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి వీరితో హ్యూజ్ మార్కెట్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు మన స్టార్ హీరోలు అందరూ కూడా 200 నుంచి 300 కోట్ల కలెక్షన్స్ ని ఈజీగా అందుకోగలుగుతున్నారు. అయితే ఈ ఏడాది తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా 300 కోట్ల మార్క్ ని టచ్ చేయలేదు. ఒకే ఒక్క మూవీ 200 కోట్ల మార్క్ దాటింది. అది మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య. హిట్ పర్శంటేజ్ టాలీవుడ్ కి ఈ ఏడాది పెరిగింది. వంద కోట్ల కలెక్షన్స్ దాటిన సినిమాలు కూడా ఉన్నాయి.

బలగం, బేబీ లాంటి చిన్న సినిమాలు 50 కోట్లకి పైగా కలెక్షన్స్ దాటాయి. అయితే బాలీవుడ్ లో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంత వెనుకబడిందని చెప్పొచ్చు. కోలీవుడ్ లో జైలర్ మూవీ ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది. అయితే టాలీవుడ్ నుంచి 500 కోట్లు దాటే సినిమా ఇప్పటి వరకైతే రాలేదు. దీనికి కారణం రాజమౌళి నుంచి ఈ ఏడాది సినిమా రాలేదు.

అలాగే సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరుకారం వస్తుందని ఎక్స్ పెక్ట్ చేసిన అది వచ్చే ఏడాది సంక్రాతికి వెళ్ళిపోయింది. ఇక కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ తో చాలా గ్యాప్ తీసుకొని దేవర మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఈ దర్శకుల నుంచి సినిమాలు రాకపోవడంతో చెప్పుకోదగ్గ మూవీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాలేదనే మాట వినిపిస్తోంది.