Begin typing your search above and press return to search.

మ‌హేష్‌..నాగార్జున సేమ్ టు సేమ్‌..ఏం మెసేజ్ ఇద్దామ‌ని!

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే మ‌హేష్‌..నాగార్జున సేమ్ టు సేమ్‌.. ఇద్ద‌రూ ఒకే త‌ర‌హాలో త‌మ‌సినిమాల ఫ‌స్ట్ లుక్‌ల‌కు పోజులిచ్చారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:17 AM GMT
మ‌హేష్‌..నాగార్జున సేమ్ టు సేమ్‌..ఏం మెసేజ్ ఇద్దామ‌ని!
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు వేడుక‌లు మంగ‌ళ‌వారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కింగ్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హంగామా చేశారు. అయితే ఇదే సంద‌ర్భంగా మ‌హేష్..కింగ్ నాగార్జున‌ని ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డంపై ఫైర్ అయ్యారు. సీనియ‌ర్‌, వ‌య‌సులో పెద్ద‌వారు. అది తెలిసి కూడా ఏదో ఫ్రెండ్‌ని పేరు పెట్టి పిల‌వ‌డం బాలేదంటూ తెగ ఫీల‌య్యారు. మ‌హేష్‌పై ఓ రేంజ్‌లో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్ట్‌లు పెట్టారు.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే మ‌హేష్‌..నాగార్జున సేమ్ టు సేమ్‌.. ఇద్ద‌రూ ఒకే త‌ర‌హాలో త‌మ‌సినిమాల ఫ‌స్ట్ లుక్‌ల‌కు పోజులిచ్చారు. దీనిపై ఇప్పుడు కామెంట్‌లు పేలుతున్నాయ్‌. వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా 'గుంటూరు కారం'. ఇందులో మ‌హేష్ ఊర మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా విడుద‌ల చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇక మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఓ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అయింది. మ‌హేష్ లుంగీ ధ‌రించి..టేబుల్‌పై కూర్చుని..బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని బీడీ వెలిగించిన స్టిల్ అభిమానుల్ని ఆక‌ట్టుకోగా మ‌రి కొంత మంది ఈ పోస్ట‌ర్ పై సెటైర్లు వేశారు. సినిమాలో ఎలాగూ ఈ సీన్ ఉంటుంది. ధూమ‌పానం హానిక‌రం అంటూ అక్క‌డ డిస్‌క్లైమ‌ర్ వేస్తారు. అలాంటి దాన్ని కూడా ఓ లుక్‌గా విడుద‌ల చేయ‌డం ఏంట‌ని ఫైర్ అయ్యారు.

ఇప్పుడు కింగ్ నాగ్ నుంచి కూడా స‌రిగ్గా ఇలాంటి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. నాగార్జున 'ది ఘోస్ట్‌' త‌రువాత కొంత విరామం తీసుకుని చేస్తున్న సినిమా 'నా సామిరంగ‌'. నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ని విడుద‌ల చేశారు. ఇందులో ఊర మాస్ లుక్‌లో మ‌హేష్ త‌ర‌హాలోనే నాగార్జున కూడా బీడీ కాలుస్తూ క‌నిపించారు. దీనిపై నెటిజ‌న్‌లు కామెంట్‌లు చేస్తున్నారు. సినిమాలో ఎక్క‌డో ఒక‌చోట ఈ సీన్ ఉంటుంది. దాన్ని ఇలా ఫ‌స్ట్ లుక్ కింద వాడ‌టం ఏమీ బాగాలేద‌ని, ఈ ఇద్ద‌రు స్టార్లు బీడీ కాలుస్తూ ఏం మెసేజ్ ఇద్దామ‌నుకుంటున్నార‌ని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. దీంతో కింగ్ నాగార్జున 'నా సామిరంగ‌' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.