Begin typing your search above and press return to search.

2024 టాలీవుడ్ డామినేషన్.. అంతా మనదేనా?

2023 బాక్సాఫీస్ వద్ద బీటౌన్ చిత్రల కన్నా సౌత్ సినిమాల డామినేషనే ఎక్కువగా ఉంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:32 AM GMT
2024 టాలీవుడ్ డామినేషన్.. అంతా మనదేనా?
X

మనదేశంలో సినిమాకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఏ చిన్న హ్యాపీ మూమెంట్ అయినా, ఫెస్టివల్ అయినా చాలా మంది మూవీతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మొన్నటి వరకు సినిమాల విషయంలో సౌత్- నార్త్ బేధం ఉండేది. గతంలో ఏకంగా భారతీయ సినిమా అంటేనే బాలీవుడ్ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పుల్ ఛేంజ్ అయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పరిస్థితి వచ్చేసింది. 2023 బాక్సాఫీస్ వద్ద బీటౌన్ చిత్రల కన్నా సౌత్ సినిమాల డామినేషనే ఎక్కువగా ఉంది. ఇక 2024లో కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ డామినేషన్ తప్పేలా లేదు.

అయితే 2023లో బాలీవుడ్ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. షారుక్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ పఠాన్, జవాన్ తో హిట్లు అందుకున్నారు. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో రణ్ వీర్ హిట్ సాధించారు. ముఖ్యంగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. గదర్ 2, ది కేరళ స్టోరీ, జరా హత్కే జరా బచ్కే, ఓ మై గాడ్ 2, 12వ ఫెయిల్, సత్య ప్రేమ్ కీ కథ, డ్రీమ్ గర్ల్ 2, సామ్ బహదూర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.

బాలీవుడ్ సినిమాలు 2023లో కొన్ని హిట్ అయినా.. అందులో ఒక సినిమా డైరెక్టర్ సౌత్ వాడే ఉన్నాడు. అలా కూడా వారికి పూర్తి ఆనందం దక్కలేదు. ఇప్పుడు ఇదే సీన్ 2024లో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. అందులో దాదాపుగా పాన్ ఇండియా సినిమాలతోపాటు సీక్వెల్స్ కూడా ఉన్నాయి.

వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి వరల్డ్ వైడ్ గా ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బాలీవుడ్ ఆడియెన్స్ పుష్ప డైలాగులు చెబుతుంటారు. అంతలా సీక్వెల్ పై అక్కడ క్రేజ్ ఉంది. అడవి శేష్ నటించిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 మూవీ ఈ ఏడాదిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ మూవీకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీ కూడా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ ఒక్క పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. పాన్ వరల్డ్ స్థాయిలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టనుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని నిర్మాత దిల్ రాజు ఇటీవలే చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మార్కెట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలు కూడా భారీ వసూళ్లు రాబడతాయి.

పవన్ కల్యాణ్- సుజిత్ కాంబోలో వస్తున్న OG సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే సుజిత్ నిర్మించిన సాహో చిత్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అంతేకాకుండా ఇప్పటికే ఓజీ గ్లింప్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. కార్తికేయ 2తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన నిఖిల్ స్వయంభు అనే హిస్టారికల్ పాయింట్ తో మరోసారి వస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే బాలీవుడ్ పై టాలీవుడ్ ఈ ఏడాది కూడా ఆధిపత్యం చెలాయించనున్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.