Begin typing your search above and press return to search.

బోయపాటి మాస్ లైనప్.. మహేష్ తో ఎప్పుడంటే..

ఉర మాస్ యాక్షన్ సినిమాలను తెరపైకి తీసుకురావడంలో బోయపాటి శ్రీను మేకింగ్ విధానం చాలా వినూత్నంగా ఉంటుంది

By:  Tupaki Desk   |   7 Oct 2023 10:41 AM GMT
బోయపాటి మాస్ లైనప్.. మహేష్ తో ఎప్పుడంటే..
X

ఉర మాస్ యాక్షన్ సినిమాలను తెరపైకి తీసుకురావడంలో బోయపాటి శ్రీను మేకింగ్ విధానం చాలా వినూత్నంగా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఎలా హైలైట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. బోయపాటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

బోయపాటితో సినిమా చేయడానికి కూడా పలువురు హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ డేట్స్ కుదరకపోవడం వలన కొత్త కాంబినేషన్స్ సెట్ కావడం లేదు. ఇక రీసెంట్గా స్కంద సినిమాతో వచ్చిన బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన లైన్ అప్ లో ఉన్న ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.. గీతా ఆర్ట్స్ లోనే రెండు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్తో గతంలో సరైనోడు సినిమాతో సక్సెస్ అందుకున్న బోయపాటి ఆ తర్వాత మరో సినిమాను గీత ఆర్ట్స్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అందులో ఒకటి అల్లు అర్జున్ తో ఉండగా మరొకటి సూర్యాతో స్టార్ట్ చేయాల్సి ఉంది..సూర్య కూడా బోయపాటి కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక కొత్త కాంబినేషన్ గురించి కూడా త్వరలోనే మరో అధికారిక ప్రకటన రానుంది.

అయితే బోయపాటి లిస్టులో నందమూరి బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పారు. ముఖ్యంగా అఖండ సీక్వెల్ ఉంటుందని అప్పుడే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. సింహ లెజెండ్ అఖండ మూడు సినిమాలు కూడా మాస్ ప్రేక్షకులకు సరికొత్త కిక్కిచ్చాయి..బాక్సాఫీస్ వద్ద కూడా ఆ మూడు సినిమాల్లో పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. ఇక బోయపాటి నందమూరి బాలకృష్ణ తో అఖండ సీక్వెల్ ను ద్వారక క్రియేషన్స్ లో చేయబోతున్నాడు.

అలాగే మహేష్ బాబు తో కూడా బోయపాటి చేయబోతున్నట్లు చాలాసార్లు కథనాలు వెలుపడ్డాయి. అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబుతో ఎప్పటి నుంచో సినిమా చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల కాంబినేషన్ సెట్ కావడం లేదు. కానీ తప్పకుండా మహేష్ తో మాత్రం భవిష్యత్తులో ఒక ప్రాజెక్టు ఉంటుంది అని బోయపాటి తెలియజేశాడు.