Begin typing your search above and press return to search.

టాలీవుడ్ క్రేజీ సినిమాలు.. గెట్ రెడీ!

తెలుగు ఇండస్ట్రీలో జూన్ నుంచి పాన్ ఇండియా సినిమాల పండగ మొదలుకాబోతోంది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:14 AM GMT
టాలీవుడ్ క్రేజీ సినిమాలు.. గెట్ రెడీ!
X

తెలుగు ఇండస్ట్రీలో జూన్ నుంచి పాన్ ఇండియా సినిమాల పండగ మొదలుకాబోతోంది. ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. మొదటి అర్ధ సంవత్సరం తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు. థియేటర్స్ కి జనాలు రావడమే కష్టంగా మారిపోయింది. అయితే ఇకపై అలా ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం పెద్ద సినిమాలు రిలీజ్ కి వస్తూ ఉండటమే.

జూన్ నెలలో చూసుకుంటే డార్లింగ్ ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి రాబోతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ సినిమాగా కల్కి 2898 ఏడీ ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ విపరీతంగా కనెక్ట్ కావడంతో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898 ఏడీ ఉండబోతోంది. ఇక ఆగష్టులో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది.

ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ వస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రంతో సంజయ్ దత్ టాలీవుడ్ లో ప్రతినాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా దేవర మూవీ ఉండబోతోంది.

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. దేవర మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న మూవీ NBK109. ఈ మూవీ అక్టోబర్ 11న దసరా కానుకగా రిలీజ్ చేస్తారంట.

దిల్ రాజు బ్యానర్ లో శంకర్ షణ్ముగం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ అవ్వొచ్చని టాక్. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ కూడా క్రిస్మస్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ ఉందట. అదే జరిగితే గేమ్ చేంజర్ వాయిదా పడొచ్చు. ఈ ఏడాది ఆఖరున డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తేనే మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి అవకాశం ఉంటుంది. లేదంటే వాయిదా పడొచ్చు.