Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబినేషన్సే.. హిట్టు పడకపోతే డేంజరే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో సరికొత్త కాంబినేషన్స్ రాబోతున్నాయి అని చెప్పవచ్చు. అయితే అందులో కొందరు మాత్రం తప్పనిసరిగా సక్సెస్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 2:45 AM GMT
క్రేజీ కాంబినేషన్సే.. హిట్టు పడకపోతే డేంజరే..
X

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు దర్శకులు అందరూ కూడా సరికొత్త కాంబినేషన్స్ లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో సరికొత్త కాంబినేషన్స్ రాబోతున్నాయి అని చెప్పవచ్చు. అయితే అందులో కొందరు మాత్రం తప్పనిసరిగా సక్సెస్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం సక్సెస్ రాకపోయినా కూడా మళ్ళీ కెరీర్ రిస్క్ లో పడుతుంది అని చెప్పాలి.

ఇంకా ఆ క్రేజీ కాంబినేషన్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నా యువ హీరోతో హిట్ కొట్టాలి అనే ప్రయత్నాలు చేస్తోందజే. అలా మొదలైంది అనే సినిమాతో మంచి గుర్తింపుని అందుకున్న నందిని రెడ్డి అలాగే ఓ బేబీ లాంటి మంచి సక్సెస్ తో పాటు ప్రశంసలు కూడా అందుకుంది. కానీ కొన్నిసార్లు ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న కథలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి.

చివరగా ఆమె నుంచే అన్ని మంచి శకునములే అనే సినిమా వచ్చింది. అంతకుముందు కల్యాణ వైభోగమే అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా దారుణంగా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ కూడా సిద్ధు జొన్నలగడ్డ పైన పెట్టుకుంది. అతనితో ఒక కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయితేనే మళ్లీ కెరియర్ ట్రాక్ లోకి వస్తుంది.

ఇక మరోవైపు జాతి రత్నాలు సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ అందుకున్న దర్శకుడు అనుదీప్. అయితే ఆ తర్వాత అతను తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అన్స్ సినిమా చేశాడు. కానీ అది దారుణంగా దెబ్బ కొట్టింది. దీంతో ఇప్పుడు మరొక సినిమా సెట్ చేసుకోవడానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక కామెడీ కథతో రవితేజ దగ్గరకు వెళ్ళగా దానిపై అతను పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడని టాక్. ప్రస్తుతం అతను పూర్తిస్థాయిలో స్క్రిప్టి సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుదీప్ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని అనుకుంటున్నాడు. అలాగే ఈ కాంబినేషన్ లో సక్సెస్ అందుకుంటేనే చూస్తేనే అతని కెరియర్ కూడా ట్రాక్ లోకి వస్తుంది.

ఇక మరొక క్రేజీ కాంబినేషన్ కోసం అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కమర్షియల్ ఫార్మాట్లో కథలతో సక్సెస్ లు అయితే బాగానే అందుకుంటూ వచ్చాడు. అతని కథలపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తూ ఉండడంతో నిర్మాతలు అతనితో సినిమాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. మినిమం క్యాలిక్యులేషన్స్ తో ఎంటర్టైన్మెంట్ అందించే అనిల్ ఇప్పుడు మెగాస్టార్ కూడా ఛాన్స్ అందుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఒక విధంగా ఇది అనిల్ రావిపూడికి పెద్ద ఛాలెంజ్ సినిమా అని చెప్పవచ్చు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు మెగాస్టార్ తో చేయబోయే సినిమా మరొక లెక్క. ఇది అతని కెరీర్ కు కూడా ఒక యూ టర్న్ గా నిలుస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడున్న జనరేషన్ దర్శకులలో ఎవరు కూడా ఆడియన్స్ సంచనాలకు తగ్గట్టుగా ప్రజెంట్ చేయడం లేదు. ఇక మళ్ళీ వింటేజ్ కామెడీ టైమింగ్ లో చిరుని చూపించాలని అనిల్ కథను రాసుకుంటున్నాడు. ఒకవేళ అది క్లిక్ అయితే అనిల్ రేంజ్ అమాంతంగా పెరిగిపోతుంది. కానీ తేడా వస్తే అంతకంటే ఎక్కువ ప్రభావం కెరీర్ పై పడుతుంది. మరి ఈ చాలెంజ్ ను అతను ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.