Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : టాలీవుడ్ లెజెండ్రీ కమెడియన్స్

యాక్షన్‌ సినిమాలు, థ్రిల్లర్ సినిమాల కంటే ఎక్కువగా కామెడీ సినిమాలు ఆడిన దాఖలాలు చాలా ఉన్నాయి

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:11 AM GMT
పిక్ టాక్‌ : టాలీవుడ్ లెజెండ్రీ కమెడియన్స్
X

తెలుగు సినిమాలో కామెడీకి ప్రముఖ స్థానం ఉంటుంది. యాక్షన్‌ సినిమాలు, థ్రిల్లర్ సినిమాల కంటే ఎక్కువగా కామెడీ సినిమాలు ఆడిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే జబర్దస్త్‌ ఇతర కామెడీ షో ల వల్ల ఇబ్బడి ముబ్బడిగా కమెడియన్స్ ఉన్నారు కానీ ఒకప్పుడు అతి తక్కువ మంది కమెడియన్స్ మాత్రమే ఉండేవారు.


1980 మరియు 1990 ల్లో తెలుగు సినిమా పై తమదైన ముద్ర వేసిన కమెడియన్స్‌ కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్‌, తనికెళ్ల భరణి, చలపతి రావు, ఎంఎస్ నారాయణ, ఏవీఎస్‌. వీరు అప్పట్లో వచ్చిన ప్రతి సినిమాల్లో ఇద్దరు ముగ్గురు అయినా కనిపించి సినిమా లో కామెడీ ట్రాక్ లో నటించేవారు.

తాజాగా ఒక నెటిజన్‌ మూడు దశాబ్దాల క్రితం ప్రముఖ తెలుగు కమెడియన్స్ అయిన బ్రహ్మానందం, బాబు మోహన్‌, తనికెళ్ల భరణి, చలపతి రావు, కోట శ్రీనివాసరావులు ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అందులో అయిదుగురు కమెడియన్స్ గట్టిగా నవ్వుతూ ఉండటం చూడవచ్చు. సదరు నెటిజన్‌ ఈ ఫోటోపై తనికెళ్ల భరణి స్పందించాలని కోరాడు.

తనికెళ్ల భరణి స్పందిస్తూ.. పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం అంటూ పోస్ట్‌ చేసి ఈ ఫోటోను రీ ట్వీట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ కామెడీ ప్రియులకు కన్నుల విందు చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఈ కమెడియన్స్ ఉంటారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.