Begin typing your search above and press return to search.

కొత్త -పాత కాంబినేష‌న్లు..కొంగొత్త‌గా రెడీ!

హీరోలు డేట్లు దొర‌క‌క‌పోవ‌డంతో హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కులు కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగని కొత్త కుర్రాళ్ల‌ని యంగ్ హీరోలు లైట్ తీసుకోవ‌డం లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 8:30 AM GMT
కొత్త -పాత కాంబినేష‌న్లు..కొంగొత్త‌గా రెడీ!
X

ఇండ‌స్ట్రీలో హీరోలంతా ఎవ‌రి బిజీలో వారున్నారు. కొంత‌మంది ద‌ర్శ‌కుల స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. హీరోలు డేట్లు దొర‌క‌క‌పోవ‌డంతో హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కులు కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగని కొత్త కుర్రాళ్ల‌ని యంగ్ హీరోలు లైట్ తీసుకోవ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ ఇండ‌స్ట్రీ లో స‌క్సెస్ అవుతున్న న‌వ‌ర‌తం ప్ర‌తిభ‌ని ప్రోత్సహించ‌డానికి అంతే ఆస‌క్తి చూపిస్తున్నారు. న‌మ్మ‌కం వ‌చ్చిందంటే? మ‌రో ఆలోచ‌న లేకుండా డేట్లు కేటాయిస్తున్నారు.

తాజాగా అలాంటి కాంబినేష‌న్స్ కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో శ‌ర్వానంద్ గ‌తేడాది ఎలాంటి సినిమా రిలీజ్ చేయ‌లేదు. కొత్త ఏడాదిలో మాత్రం పుల్ జోష్ లో క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. అది పూర్త‌యిన వెంట‌నే రామ్ అబ్బ‌రాజ్..క‌ల్యాణ్ శంక‌ర్ తో శ‌ర్వా సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతు న్నాడు.

ఇదే స్పీడ్ లో వెబ్ సిరీస్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మూన అభిలాష‌రెడ్డితోనూ ఓ సినిమాకి క‌మిట్ అయిన‌ట్లు వినిపిస్తుంది. 'లూజ‌ర్' వెబ్ సిరీస్ తో అభిలాష్ ఎంట్రీ ఇచ్చాడు. వెబ్ సిరీస్ మేకింగ్ చూసి శ‌ర్వా ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుందిట‌. అలాగే యూత్ స్టార్ నితిన్ కూడా ఈ మ‌ధ్య కాలంలో కొత్త వాళ్ల‌తోనే ముంద‌కెళ్తున్నాడు. 90 స్ వెబ్ సిరీస్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఆదిత్య హాస‌న్ తో నితిన్ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రాన్ని త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట నితిన్. ఇప్ప‌టికే స్టోరీ కూడా లాక్ అయిందంటున్నారు. ప్ర‌స్తుతం నితిన్ ..వెంకీ కుడుమ‌లతో 'రాబిన్ హుడ్' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక నేచుర‌ల్ స్టార్ నాని వేగం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మ‌ధ్య కాలంలో వేగంగా సినిమాలు రిలీజ్ చేయ‌డంలో నాని ముందుంటున్నాడు. ఇప్ప‌టికే నాని కోసం బ‌లంగా వేణు..శ్రీకాంత్ ఓదెల వెయిట్ చేస్తున్నారు. అలాగే సుజిత్ కూడా నానితో ఓ సినిమా చేయ‌డానికి క్యూలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దీన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోతున్నారుట‌. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు శేఖ‌ర్ కమ్ములా రానాతో సినిమా చేయాల‌ని అంతే ఉత్సాహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే 'లీడ‌ర్' త‌ర్వాత మ‌ళ్లీ చేతులు క‌ల‌పుతోన్న జోడీగా చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఏషియ‌న్ సినిమాస్ నిర్మించ‌డానికి ముందుకొస్తుందిట‌. అలాగే రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో 'రాక్ష‌స రాజ్యం 'సినిమా కూడా క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే.