Begin typing your search above and press return to search.

2023 బాక్సాఫీస్.. టాలీవుడ్ టాప్-10 సినిమాలు ఇవే!

ఎందుకంటే హిందీ సినిమాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ హీరోలకి దేశవ్యాప్తంగా పాపులర్ కి ఉంటుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 11:30 PM GMT
2023 బాక్సాఫీస్.. టాలీవుడ్ టాప్-10 సినిమాలు ఇవే!
X

మరో వారం రోజుల్లో 2023 ఏడాదికి గుడ్ బై చెప్పేస్తాం. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేముందు గడిచిపోయిన సంవత్సరంలో మనం ఏం సాధించాం? అనే లెక్కలు వేసుకోవడం సహజమే. ఈ లెక్కల్లో సినిమాని తీసుకుంటే ఏ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది? నష్టాన్ని చేకూర్చింది? ఏ హీరోకి హిట్ వచ్చింది? తదితర అంశాల్ని సినిమా అభిమానులు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్న బాలీవుడ్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది.

ఎందుకంటే హిందీ సినిమాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ హీరోలకి దేశవ్యాప్తంగా పాపులర్ కి ఉంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు బాలీవుడ్ కు గట్టి పోటీ ఇచ్చేలా టాలీవుడ్ పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్ టెన్ లో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ టాలీవుడ్ అని స్పెషల్ గా మెన్షన్ చేసింది ఎందుకంటే ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే అని అర్థం.

1. వాల్తేరు వీరయ్య : బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. చిరు తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రూ.160 కోట్ల షేర్ వసూలు చేసి ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా టాప్ వన్ స్థానానికి దక్కించుకుంది.

2. ఆదిపురుష్ : రామాయణం ఆధారంగా ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్లు నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది టాలీవుడ్ లో 130 కోట్లు రాబట్టి టాప్ టు ప్లేస్ ని సొంతం చేసుకుంది.

3. వీరసింహా రెడ్డి : ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య పోటీకి దిగారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో కేవలం 97 కోట్లు రాబట్టి మూడో స్థానాన్ని దగ్గించుకుంది.

4. భగవంత్ కేసరి : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 110 కోర్టు రాబట్టిన ఈ సినిమా లో 85 షేర్ అందుకొని నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

5. బ్రో : మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన బ్రో ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల గ్రాస్ రాబట్టగా 62 కోట్లు షేర్ వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

6. దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ దసరా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాబట్టి 76 కోట్లు షేర్ తో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

7. జైలర్ : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రజనీకాంత్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. పంచవ్యాప్తంగా రూ.604 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో రూ.68 కోట్లు రాబట్టి ఏడవ స్థానంలో నిలిచింది.

8. బేబి : ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్నచిత్రంగా విడుదల పెద్ద విజయాన్ని అందుకుంది బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.81 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో రూ.64 కోట్లతో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

9. విరూపాక్ష : కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో రూ.63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానంలో చోటు దక్కించుకుంది.

10. సలార్ : కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఇక టాలీవుడ్ లో రూ.101 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లిస్టులో మూడో స్థానానికి క్లోజింగ్ అయ్యేనాటికి టాప్-1 లోకి కూడా రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.