Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బిగ్ స్టార్స్.. వెయ్యి కోట్ల ఆశలు!

అయితే ఎవరు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ఒక తెలుగు సినిమా అభిమానులుగా ప్రతి ఒక్కరు గర్వపడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2024 8:02 AM GMT
టాలీవుడ్ బిగ్ స్టార్స్.. వెయ్యి కోట్ల ఆశలు!
X

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఇప్పటి వరకు నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అందులో రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ కాగా, సలార్ సూపర్ హిట్ అయ్యింది. సాహో మూవీ ఏవరేజ్ టాక్ తో గట్టెక్కింది. రాజమౌళి ఇచ్చిన స్టార్ డమ్ ప్రభాస్ కి తరువాత కూడా కొనసాగింది అని చెప్పడానికి అతని సినిమాలకి ఫస్ట్ డే వస్తోన్న ఓపెనింగ్స్ ఉదాహరణగా చూపించొచ్చు.

సలార్ కి పోటీగా డంకీ, ఆక్వామెన్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయిన కూడా పోటీని తట్టుకొని సలార్ ప్రపంచ వ్యాప్తంగా 750 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా క్లిక్ అయితే బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 1000 కోట్లు ఎంత స్పీడ్ గా కలెక్ట్ చేస్తుందనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇదిలా ఉంటే రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ లేకుండా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. యాక్టర్ గా నేషనల్ అవార్డుని సైతం బన్నీ అందుకున్నారు. పుష్ప సినిమాలో సాంగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాపైనే దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా ఏ మాత్రం వర్క్ అవుట్ అయిన కూడా 1000 కోట్ల కలెక్షన్స్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ మీద ప్రభాస్, తారక్, చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. అయితే ప్రభాస్, బన్నీలలో ఎవరు టాప్ స్టార్ అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ హీరోనే అందరికంటే టాప్ అని అంటూ ఉంటే డార్లింగ్ అభిమానులు అయితే ప్రభాస్ ఇమేజ్ ని ఇంకెవరూ అందుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఎవరు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ఒక తెలుగు సినిమా అభిమానులుగా ప్రతి ఒక్కరు గర్వపడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేసే స్థాయికి ఎదగడం గొప్ప విషయం అని అంటున్నారు. ఈ హీరోల నుంచి భవిష్యత్తులో అద్భుతమైన కథలని ప్రేక్షకులు చూడగలరని అభిప్రాయ వ్యక్తం అవుతోంది.