Begin typing your search above and press return to search.

2023 టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్స్.. ధూమ్ ధామ్

మరో ఐదురోజుల్లో 2023కి గుడ్ బై చెప్పి 2024కు వెల్ కమ్ చెప్పనున్నాం. ఈ ఏడాది టాలీవుడ్ లో దాదాపు 60కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:15 AM GMT
2023 టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్స్.. ధూమ్ ధామ్
X

మరో ఐదురోజుల్లో 2023కి గుడ్ బై చెప్పి 2024కు వెల్ కమ్ చెప్పనున్నాం. ఈ ఏడాది టాలీవుడ్ లో దాదాపు 60కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు ఆశించని విజయాలు అందుకోగా.. మరికొన్ని నిరాశపరిచాయి. 2023లో దాదాపు అరడజను స్టార్ హీరోలు గ్యాప్ ఇచ్చారేమో గానీ హీరోయిన్స్ మాత్రం బాగానే సందడి చేశారు. పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ తప్ప మిగతా టాప్, మీడియం, కొత్త హీరోయిన్లు ఆకట్టుకున్నారు. మరి 2023లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన బ్యూటీలెవరో ఇప్పుడు తెలుసుకందాం.

దసరాతో కీర్తి సురేశ్ ధూమ్ ధామ్


ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ ఉంది బ్యూటీ కీర్తి సురేశ్. మార్చిలో నెలలో దసరాతో వచ్చింది కీర్తి. ఈ సినిమా విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథలో కీలకమైన, నటించే అవకాశం ఉండే పాత్ర ఆమెకి దక్కింది. వెన్నెల పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి చేసిన చేసిన తీన్మార్ డ్యాన్స్ కూడా బాగా వైరల్ అయ్యింది. దసరా తర్వాత భోళా శంకర్ లో చిరంజీవి సిస్టర్ పాత్రలో కనిపించింది ఈ అమ్మడు. కానీ ఈ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవు కానీ దాదాపు నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.

విరూపాక్ష సంయుక్త


మల్లు బ్యూటీ సంయుక్త మీనన్ కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుశ్ చేసిన సార్ సినిమాతో ప్రశంసలు అందుకుంది. విరూపాక్ష సినిమాలో అనుహ్యమైన పాత్రను చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భయపెట్టే సీన్స్ లో అమ్మడు ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ఈ ఏడాదిని ముగించడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే ఆమె ఖాతాలో హ్యాట్రిక్ పడినట్లే.

బేబీ లవ్ లో వైష్ణవి క్రేజ్


బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీ 2023 చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. వైష్ణవి లిప్ లాక్ తో కూడా స్టన్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఏడాది టాప్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లలో అమ్మడు కూడా టాప్ ప్లేస్ లో ఛాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు.

హాయ్ నాన్నతో సీత మ్యాజిక్


సీతారామంతో సీతగా ప్రేక్షకులు గుర్తుండిపోయిన మృణాల్ ఠాకూర్.. ఈ ఏడాది హాయ్ నాన్నతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో యష్ణ పాత్రలో మరోసారి ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకుంది. మరి వచ్చే ఏడాది టాలీవుడ్ లో బ్యూటీల సందడి ఎలా ఉంటుందో చూడాలి మరి.