Begin typing your search above and press return to search.

అనుష్క‌(42)..త్రిష‌(40) పెళ్లెప్పుడు?

సౌత్ లో క్రేజీ భామలుగా దూసుకుపోతున్న అందాల భామ‌లు అనుష్క‌.. త్రిషల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:30 PM GMT
అనుష్క‌(42)..త్రిష‌(40) పెళ్లెప్పుడు?
X

సౌత్ లో క్రేజీ భామలుగా దూసుకుపోతున్న అందాల భామ‌లు అనుష్క‌.. త్రిషల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు హీరోయిన్లు క‌లిసి ప‌నిచేయ‌ని హీరోలు లేరు. తెలుగు..త‌మిళ్ భాష‌ల్లో ఎన్నో చిత్రాల్లో న‌టించారు. రెండు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నారు. న‌ట‌న ప‌రంగా త‌మకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ త‌మ బ్రాండ్ ని వేసారు. నేటి త‌రం న‌వనాయిక‌ల‌కు పోటీగా అవ‌కాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలకు ఈ భామ‌లిద్ద‌రు మంచి ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నారు.

చిరంజీవి.. బాల‌య్య‌... వెంక‌టేష్.. నాగార్జున.. ర‌వితేజ‌ లాంటి స్టార్ల‌కు స‌రిజోడీగా ఈభామ‌ల్ని చెప్పొచ్చు. సీనియ‌ర్ నాయిక‌ల్ని తీసుకోవాల్సి వ‌స్తే మేక‌ర్స్ క‌చ్చితంగా ఈ ఇద్ద‌రి భామ‌ల పేర్ల‌ను ప‌రిశీలన‌లోకి తీసుకోవాల్సిందే. ఇక చిరంజివి త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోల‌తోనూ భామా మ‌ణులు క‌లిసిప‌నిచేస్తున్నారు. స్టోరీ డిమాండ్ మేర‌కు త‌మ‌ని తాము సునాయాసంగా మౌల్డ్ చేసుకుంటున్నారు. ఇలా కెరీర్ ప‌రంగా తిరిగి చూడాల్సిన ప‌నిలేదు. మ‌రో ఐదారేళ్ల పాటు తిరుగుండ‌దు.

మరి పెళ్లి మాటేంటి;? అంటే మాత్రం స‌రైన స‌మాధానం దొర‌క‌లేద‌న చెప్పాలి. ఇద్ద‌రు ఇప్ప‌టికే 40 ఏళ్ల‌కు పైబ‌డ్డారు. కానీ ఇంత‌వ‌ర‌కూ వివాహ గ‌డియ‌లు మాత్రం రాలేదు. అప్ప‌ట్లో త్రిష .. వ్యాపార వేత్త వ‌రుణ్ మ‌నియ‌న్ తో నిశ్చితార్దం చేసుకుంది. కానీ అది పెళ్లివ‌ర‌కూ దారి తీయ‌లేదు. పొర‌పొచ్చాలు రావ‌డంతో ఎంగేజ్ మెంట్ తో ఆ బంధానికి పుల్ స్టాప్ పెట్టింది. ఆ త‌ర్వాత త్రిష ఎవ‌రితోనూ ప్రేమ‌లోనూ ప‌డింది లేదు.

పెళ్లి వార్త వ‌చ్చింది లేదు. ఇక అనుష్క‌ పెళ్లి విష‌యంలో బ‌ల‌మైన ప్ర‌చారం కూడా లేదు. వ‌య‌సు 42 వ‌చ్చేసినా నో మ్యారేజ్ అంటోంది. ఇంట్లో త‌ల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి తెస్తున్నా మ‌న‌సుకు నిచ్చిన కుర్రాడు దొర‌క‌లేద‌ని దాటేస్తుంది. మ‌రి ఈ భామ‌లిద్ద‌రు 2024 లోనైనా వివాహంతో ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెడ‌తారేమో చూడాలి.